Sunday, December 8, 2024
HomeదైవంMulkanuru: మినీ మేడారం @42 ఏళ్లు

Mulkanuru: మినీ మేడారం @42 ఏళ్లు

ముల్కనూర్ సమ్మక్క జాతర

రవాణా, బీసి సంక్షేమ శాఖా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ముల్కనూర్ సమ్మక్క సారక్క జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమ్మక్క సారక్క జాతర చైర్మన్ గా మాడుగుల వీరస్వామి, కమిటీ మెంబర్లుగా కొదురుపాక శ్రీనివాస్, కాసగోని లలిత వెంకన్న గౌడ్, కొత్తపల్లి సమ్మయ్య యాదవ్, దొంతరబోయిన రవి, రుద్రాక్ష సాంబమూర్తి, సుతారి రాజమౌళి, గుడికందుల సమ్మయ్య, పెంటపూర్తి వీరారెడ్డి, జక్కుల ప్రకాశం యాదవ్, గనబోయిన కొమురయ్య, శ్రీరామోజు సమ్మయ్య, మాడుగుల గోపి, సాగంటి వెంకటేశ్వర్లు, మాచర్ల సదానందం గౌడ్ లను ఎన్నుకున్నారు.

- Advertisement -

1982 సంవత్సరంలో అలిగిరెడ్డి రాజిరెడ్డి, 8 మంది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో కోయ పూజారి హనుమంతయ్య సమక్షంలో ముల్కనూరు గ్రామ పొలిమేర్లో వనదేవతల గద్దెలను నిర్మించి జాతర ప్రారంభించారు. అప్పటినుంచి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని జాతర కొనసాగిస్తున్నారు. మేడారం నుంచి కోయ పూజారులు వచ్చి నాలుగు రోజులపాటు పూజలు చేయడం ప్రత్యేకత. ఆహ్లాదకరమైన వాతావరణం.. సేద తీరేందుకు పచ్చటిచెట్లు.. గ్రామ పొలిమేరలో కొలువుదీరిన అమ్మవారు.. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే ముల్కనూర్ సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రస్తుత జాతరకు 42 ఏళ్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News