Cat Eye Gemstone Top Benefits: భారతదేశంలో రత్నాలకు ఎంతో ప్రసిద్ధి ఉంది. వీటిని నవరత్నాలు అని కూడా పిలుస్తారు. ‘నవ’ అంటే తొమ్మిది అని అర్థం. నీలం, కెంపు, వజ్రం, పచ్చ, ముత్యం, పగడం, పుష్యరాగం, గోమేధికం చివరిగా వైడూర్యం వీటిని నవరత్నాలని చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రత్నాలకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. జాతకంలోని గ్రహ దోషాలను, జన్మ నక్షత్రం లేదా దశ మార్పుల వల్ల కలిగే సమస్యలను తొలగించుకోవడానికి వీటిని ధరిస్తారని జాతక నిపుణులు చెబుతున్నారు. మనం ధరించే రత్నానికి నవగ్రహాలతో సంబంధం ఉంటుంది. వాటిలో వైడూర్యానికి (Cat’s Eye) కూడా ఎన్నో ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి. వైడూర్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించితెలుసుకుందాం.
నవగ్రహాలలో కేతువు అత్యంత శక్తివంతమైన గ్రహం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కేతువును ‘మోక్ష కారకుడు’ అని పిలుస్తారు. జాతకంలో కేతువు సంచారం వ్యక్తిని ఆధ్యాత్మిక, విముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. కేతువు ఇచ్చే ఫలితాలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు. జోతిష్యంలో కేతువు బలంగా ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. అదే బలహీనంగా ఉంటే గందరగోళం, చర్మ వ్యాధులు, నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి ఇటువంటి దోషాల నుంచి ఉపశమనం పొందడం కోసం జ్యోతిష్యులు వైడూర్యాన్ని (Cat’s Eye) ధరించమని సూచిస్తారు. వైడూర్యం కేతువుకు చిహ్నం. హిందీలో ‘లహసునియా’ అని కూడా పిలుస్తారు. ఈ రత్నం చూడానికి పిల్లి కన్నులగా ఉంటుంది. అందుకే దీనికి ‘క్యాట్స్ ఐ’ అనే పేరు వచ్చింది.
వైడూర్యం ధరించడం వల్ల కలిగే లాభాలు ( Cat eye Uses):
వైడూర్యం ధరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ధ్యానంపై ఏకాగ్రత పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆందోళనలు, ఒత్తిడి, భయాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జాతకంలో కేతు సంచారం కారణంగా ఆకస్మిక లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్, వ్యాపారంలో, కేరీర్ లో అత్యుత్తమ స్థాయి లభిస్తుంది.
వైడూర్యం ధరించడం వల్ల నరదిష్టి నుంచి ఉపశమనం కలుగుతుంది. చెడు గాలి నుంచి రక్షిస్తుందని జ్యోతిష్య శాస్త్రలు చెబుతున్నాయి. ఈ రత్నం వల్ల కేవలం జాతక దోషాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యశాస్త్రలు చెబుతున్నాయి.
వైడూర్యం ఎలా ధరించాలి (how to wear cat eye stone):
వైడూర్యాన్ని శనివారం రోజున ధరిస్తారు. దీని సూర్యోదయానికి లేదా అర్థరాత్రి సమయంలో ధరించాలి. ఈ ఉంగరాన్ని వెండిలో చేయించుకోవాలి. దీనిని చేతి మధ్య వేలకు పెట్టుకోవాలి. ఇది ధరించే ముందు ఉంగరాన్ని దేవుడి ముందు ఉంచి పాలతో అభిషేంచేయాలి, ధరించే ముందు “ఓం కేం కేతవే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాల్సి ఉంటుంది.
వైడూర్యం ఎవరు ధరించకూడదు (Who Should Avoid Cat Eye Stone):
వైడూర్యం ప్రతిఒక్కరు ధరించడం సరికాదు. కొన్ని నక్షత్రాలు వారు, లేదా కేతు సంచారం ఉన్నప్పుడు మాత్రమే దీని జోత్యిషులు సూచిస్తారు. వైడూర్యం ధరించే ముందు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మొదట్టిగా వ్యక్తి జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉన్నాడా లేదా అని చూడకుండా ధరించకూడదు. జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు ఈ రత్నాని ధరించకూడదు.
మార్కెట్‌లో వైడూర్యాని కొనుగోలు చేసే ముందు పగుళ్లు, మచ్చలు, కాంతి లేని రత్నాని తీసుకోకూడదు. ఇలాంటి రత్నాలు ధరించడం వల్ల ప్రమాదాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వైడూర్యం రత్నాని మకరం, కుంభ రాశుల వారు జ్యోతిష్యునిపుణుల సలహా లేకుండా దీని ధరిచకూడదు. ధనుస్సు, మీన రాశుల వారు ధరించాలి ఈ రాశుల వారికి గురువు అధిపతి. అలాగే కేతువు వృశ్చిక రాశిలో శుభ స్థానంలో ఉన్నప్పుడు జాతక పరిశీలన తర్వాత ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:
వైడూర్యం శక్తివంతమైనది దీనిని ధరించడం వల్ల కలలు రావడం లేదా చిన్న చిన్న సంఘటనలు జరుగాయి. మీ జాతకం ప్రకారం దీని ధరించండి.

