Best shiva temples to visit during Mahashivratri 2026: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. 2026లో ఈ పండుగ ఫిబ్రవరి 15న రానుంది. శివరాత్రి అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాదు.. అది అంతర్ముఖ ప్రయాణం, క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపుకు నిదర్శనం. ఈ పవిత్ర పర్వదినాన దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవే.
1. శ్రీశైలం మల్లికార్జున స్వామి (ఆంధ్రప్రదేశ్)
నల్లమల అడవుల మధ్య కొలువై ఉన్న శ్రీశైలం క్షేత్రం అటు జ్యోతిర్లింగంగా, ఇటు శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. 7వ శతాబ్దం నాటి చరిత్ర గల ఈ ఆలయంలో శివరాత్రి నాడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా విరామం లేకుండా జరిగే అభిషేకాలు, పూజలు ఇక్కడ ప్రత్యేకం. భక్తులు సుమారు 14 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి.
2. అరుణాచలేశ్వర ఆలయం, తిరువణ్ణామలై (తమిళనాడు)
అగ్నిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో కొండనే సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు. 14 కిలోమీటర్ల పొడవైన అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి దేశవిదేశాల నుండి భక్తులు తరలివస్తారు. రాత్రంతా జరిగే గిరి ప్రదక్షిణతో పాటు, స్వామివారికి సమర్పించే నాట్యాంజలి నృత్య నీరాజనాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.
3. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
దక్షిణాభిముఖంగా ఉండే ఏకైక జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ప్రసిద్ధ భస్మ హారతి. పవిత్రమైన భస్మంతో చేసే ఈ పూజను చూడటం జన్మధన్యమని భక్తులు నమ్ముతారు.
4. కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి (ఉత్తరప్రదేశ్)
ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీలో శివరాత్రి అంటే ఒక పెద్ద సంబరం. గంగా నది తీరమంతా దీపకాంతులతో వెలిగిపోతుంది. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు. నగరం గుండా సాగే ‘శివ భారత్’ (శివుని ఊరేగింపు) చూడముచ్చటగా ఉంటుంది.
Also Read: Vijaya Ekadashi 2026 – అప్పుల బాధలా? కెరీర్‌లో ఆటంకాలా? ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేయండి చాలు..
5. సోమనాథ్ ఆలయం, గుజరాత్
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయం అరేబియా సముద్ర తీరంలో గంభీరంగా కనిపిస్తుంది. రాత్రంతా నాలుగు ప్రహరాల పూజలు మరియు మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. సముద్రం నేపథ్యంలో ఆలయ చరిత్రను వివరించే లేజర్ లైట్ అండ్ సౌండ్ షో భక్తులకు కనువిందు చేస్తుంది.
6. ఈషా యోగా సెంటర్, కోయంబత్తూరు (తమిళనాడు)
ఆధ్యాత్మికవేత్త సద్గురు నేతృత్వంలో ఇక్కడ శివరాత్రి వేడుకలు విభిన్నంగా సాగుతాయి. 112 అడుగుల ఆదియోగి విగ్రహం ముందు ఈ వేడుకలు జరుగుతాయి. కేవలం భక్తి మాత్రమే కాకుండా యోగా, ధ్యానం, మరియు సంగీతంతో కూడిన మేలుకొలుపు ఇక్కడ ప్రత్యేకత.

