Saturday, November 23, 2024
HomeదైవంNandavaram: చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలు 22-28 వరకు

Nandavaram: చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలు 22-28 వరకు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతి, రథ, వసంతోత్సవములు ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నందవరం చౌడేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి వీఎల్ఎన్ రామానుజన్, ఆలయ సిబ్బంది, మండలంలోని అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

- Advertisement -

చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు సందర్భంగా ఆలయ సిబ్బందికి దేవస్థానం వారి తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అందించే వస్త్రాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ .. బనగానపల్లె మండలంలో నందవరం గ్రామంలో స్వయంగా కాశీ విశాలాక్షి అమ్మవారు చౌడేశ్వరి దేవి అలంకారంలో ఇక్కడ దర్శనమిస్తుందని, ఇక్కడ అమ్మవారినిదర్శించుకోవడానికి కర్నూలు, కడప అనంతపురం జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారన్నారు.

అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు హాజరు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ సుబ్బరాయుడు ఆదేశించారు.

25వ తేదీన శనివారం ఉదయం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన పసుపు కుంకుమ పట్టు వస్త్రాల అలంకరణతో మొదలయ్యి రాత్రి 12 గంటలకు శ్రీ భాస్కరయ్య ఆచారి గారిచే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టనున్నారు. అదే రోజు రాత్రి ఒంటిగంట నుండి చౌడేశ్వరి దేవి అమ్మవారి మహోత్సవం లో ప్రధాన ఘట్టమైన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News