Saturday, October 5, 2024
HomeదైవంNarender Reddy Ayyappa Puja: శరణుఘోషతో మారుమోగిన అల్ఫోర్స్

Narender Reddy Ayyappa Puja: శరణుఘోషతో మారుమోగిన అల్ఫోర్స్

అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవంలో నరేందర్ రెడ్డి

అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం మహోన్నతమైనదని మహిమానిత్వమైనదని తద్వారా సకల పాపాలనుండి విముక్తులమౌతామని మానవజన్మను పునీతం చేస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మేన్క్యాంపస్ ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోతమాచార్యులు గురుస్వామి (గూడెం స్వామి) మార్గదర్శకమున శాస్త్రోంగా వేద మంత్రాల మధ్య పదునెట్టంబడి పూజను సాంప్రదాయంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీ మహా గణపతికి పూజను నిర్వహించి దేదీప్యమానంగా ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ అయ్యప్ప మహాపడి పూజ చేయడం పూర్వ జన్మ సుక్రుతమని ఎన్నో ఆటంకాలను తొలగించి సర్వశుభాలను పొందడానికై మార్గాన్ని సుగమం చేస్తుందని తెలుపుతూ మహాదేవుని పుత్రుడైన హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడు పుష్కలంగా పొందడానికై వారి కార్యాలను అత్యంతభక్తిశ్రద్ధలతో ఆచరించి జీవనాన్ని ఆటంకంలేకుండా కొనసాగించడానికై దోహద పడుతుందని అన్నారు. అంతటి మహిమ గల స్వామి యొక్క ఆశీస్సులను విశేషంగా సమాజాభివృద్ధికై విశ్వ శ్రేయస్సుకై పలు కార్యక్రమాలను ఆధ్యాత్మిక చింతనతో చేపడుతూ ముందుకు కొనసాగుతున్నామని అన్నారు.

విశేషంగా విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి ప్రత్యక్షంగా వివిధ ఫలితాల రూపంలో కనబడుతుందని అన్నారు. మహాపడి పూజలో బాగంగా శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారికి విశేషంగా వివిధ రకాల పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, విశేషంగా ఫల పంచామృతాలతో, పండ్లరసాలతో స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోష మధ్య వైభోపేతంగా నిర్వహింపబడిన పూజా కార్యక్రమంలో గురుస్వామి వారి ఆశీస్సులు అందరికి అందజేయం జరిగిందని అన్నారు. శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోతమాచార్యులు గురుస్వామి (గూడెం స్వామి) మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఆద్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తు విద్యార్థుల్లో విద్యతో పాటు ఆధ్యాత్మికతను పెంపొదిస్తున్నారని తెలిపారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా తప్పనిసరిగ్గా విశేష ఫలితాలు పొందగల్గుతామని తెలుపుతూ శభరిమల్లో నిర్వహించబడే పూజా విధానాన్ని ఈ ప్రాంగణంలో కూడా అవలంభించి పదునెటంబడి పూజను విశేషంగా విద్యుత్కాంతుల నడుమ భక్తుల కోలాహాలం నడుమ స్వామి వారి శరణుఘోశ మధ్య నిర్వహిండం చాలా శ్రేయస్సుకరమైనదని తెలుపుతూ కరీంనగర్ భక్త భృందానికి స్వామి వారియొక్క ఆశీస్సులు ఎల్లపుడు విశేషంగా ఉండాలని ఆశీర్వదించారు.

నరేందర్రెడ్డి భవిష్యత్లో మరిన్ని పూజలను విశేషంగా నిర్వహింపబడి ఆధ్యాత్మిక చింతనకు మారుపేరుగా ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా పలు దీక్షాపరులు ఆలపించిన అయ్యప్ప గేయాలు, ప్రత్యేకంగా దిగు దిగు నాగ నాగన్న, శబరికొండల్లో వెలసిన అయ్యప్ప, ధర్మశాస్త్ర సన్నిదిల్లో కొలువైన అయ్యప్ప గేయాలు చాలా అలరింపచేసాయి. దీక్షాపరులు చేసిన నృత్యాలతో ఉత్సాహం రెట్టిం పైనదన్నారు. అనంతరం విచ్చేసిన దీక్షాపరులకు అల్పను ఏర్పాటు చేయడం జరిగనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 వందల మంది అయ్యప్ప దీక్షా పరులు , పాఠశాలల, కళాశాలల సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News