Sunday, November 16, 2025
HomeదైవంNeem Plant:పితృ దోషాలను తొలగించే వేప... ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవాలంటే..

Neem Plant:పితృ దోషాలను తొలగించే వేప… ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవాలంటే..

vastu-Neem Plant:భారతీయ సంప్రదాయాల్లో చెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చెట్టుకీ ఒక ప్రత్యేకతను ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా వివరిస్తారు. అందులో ముఖ్యంగా వేప చెట్టు ప్రస్తావన తరచూ వస్తుంది. వేపను ఆయుర్వేద వైద్యంలో సర్వరోగ నివారిణిగా భావిస్తారు. అదే సమయంలో జ్యోతిషశాస్త్ర దృష్టిలో కూడా ఈ చెట్టు విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గ్రహ దోషాల నుంచి విముక్తి పొందడంలో వేప చెట్టుకు సంబంధం ఉందని ప్రాచీన గ్రంథాల్లో వివరాలు ఉన్నాయి.

- Advertisement -

గ్రహాలు ప్రతికూలంగా..

జ్యోతిషశాస్త్రం ప్రకారం వేప చెట్టు శని గ్రహం,  కేతువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ప్రతికూలంగా ఉంటే వ్యక్తి జీవితంలో సమస్యలు ఎదురవుతాయని నమ్మకం. అటువంటి సందర్భాల్లో వేప చెట్టును నాటడం, దానిని పూజించడం ద్వారా శని, కేతు ప్రభావాలను తగ్గించవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు. వేపతో హవనం చేస్తే శనిదేవుని కోపం తగ్గి, ఆయన కృప కలుగుతుందని విశ్వసిస్తారు. అదే విధంగా వేప ఆకులతో స్నానం చేయడం ద్వారా కేతు దోషం ప్రభావం తగ్గుతుందని అనడం జరుగుతుంది.

దైవ శక్తులకు నిలయమని..

వేప చెట్టు దైవ శక్తులకు నిలయమని అనాదిగా భావిస్తున్నారు. ఇల్లు నిర్మించినప్పుడు దక్షిణం లేదా పశ్చిమ దిశలో వేపను నాటడం శుభకరమని చెబుతారు. ఈ దిశల్లో వేప చెట్టు పెరిగితే అది చెడు శక్తులను దూరం చేస్తుందని, ఇంట్లో సానుకూల వాతావరణం కల్పిస్తుందని నమ్మకం. వేప నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిదే కాకుండా కుటుంబ సభ్యులకు శాంతి, సంతోషాలు కలిగిస్తుందని చెప్పబడింది. అదనంగా పితృ దోషం నుంచి విముక్తి పొందడంలో కూడా వేప పాత్ర ఉందని విశ్వాసం.

శనిదోషం వల్ల..

శనిదోషం వల్ల ఇబ్బంది పడేవారు వేప చెక్కతో తయారు చేసిన దండను ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చని జ్యోతిషశాస్త్ర విశ్లేషణలు సూచిస్తున్నాయి. అలా చేస్తే శనిదేవుని ప్రతికూల ప్రభావం తగ్గి, జీవితంలో అనుకూల మార్పులు కలుగుతాయని నమ్మకం. అదేవిధంగా ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో వేప చెట్టుకు నీరు సమర్పించడం వలన జాతకంలో ఉన్న ప్రతికూల గ్రహాలు శాంతిస్తాయని భావిస్తారు.

దక్షిణ దిశలో నాటడం..

వేప చెట్టును జ్యోతిషశాస్త్రంలో కుజుని రూపంగా కూడా భావిస్తారు. కాబట్టి దానిని ఇంటి దక్షిణ దిశలో నాటడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. కానీ తూర్పు లేదా ఉత్తర దిశల్లో వేప చెట్టును నాటరాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వేప ఒక పెద్ద చెట్టు కాబట్టి ఆ దిశల నుంచి వచ్చే శుభ శక్తిని అడ్డుకోవచ్చని అంటారు. అందువల్ల సరైన దిశలో వేపను నాటడం అత్యంత ముఖ్యమని భావిస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

ఇంట్లో తోటకు స్థలం ఉంటే తప్పక వేప చెట్టును పెంచుకోవాలి. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అనేక లాభాలు ఇస్తుంది. వేప ఆకులు, కాయలు, తొక్క, వేర్లు అన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వేప గాలిలో వ్యాధులను తగ్గించే శక్తి ఉందని నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ వేప చెట్టు నీడలో కూర్చోవడం, వేప ఆకులతో ఊయలలు కట్టడం, ఇళ్లలో వేపను అలంకరణగా ఉపయోగించడం జరుగుతూనే ఉంది. ఇవన్నీ దాని ఆరోగ్య, ఆధ్యాత్మిక విలువలకు నిదర్శనాలు.

Also Read: https://teluguprabha.net/devotional-news/lunar-eclipse-rituals-and-upcoming-solar-eclipse-details/

పితృ దోషం నుంచి విముక్తి పొందడానికి వేప చెట్టు పూజించడం ముఖ్యమని అనేక పురాణాల్లో సూచనలు ఉన్నాయి. పూర్వీకుల కృప లభించాలంటే వేప చెట్టును గౌరవంగా పూజించడం అవసరమని విశ్వాసం ఉంది. వేప చెట్టు నీడలో కూర్చుని పితృ తర్పణం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని అంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad