Saturday, November 15, 2025
HomeదైవంNeptune Transit 2025: సెప్టెంబరులో వరుణుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు మంచి రోజులు మెుదలు..

Neptune Transit 2025: సెప్టెంబరులో వరుణుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు మంచి రోజులు మెుదలు..

Neptune Retrograde 2025 in September: నవగ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దీనినే వరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. సెప్టెంబరు 06న వరుణుడు వృషభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. సాధారణంగా తిరోగమనంలో ఉన్న ఏ గ్రహమైన చెడు ఫలితాలనే ఇస్తుంది, కానీ వరుణుడు శుభఫలితాలను ఇవ్వబోతున్నాడు. నెప్ట్యూన్ తిరోగమనం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మకర రాశి
వరుణుడి రివర్స్ కదలిక మకర రాశి వారికి మేలు చేస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ కెరీర్ లో అనుకోని సక్సెస్ ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వైవాహిక, ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు.

మీన రాశి
వరుణుడు సంచారం వల్ల మీనరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. లవ్ సక్సెస్ అయి అది పెళ్లికి దారితీస్తుంది. మీకు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ కెరీర్ ఊపందుకోనుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. వైవాహిక జీవితం మధురంగా గడుస్తోంది.

Also read: Durga Ashtami 2025 -ఈ ఏడాది దుర్గాష్టమి ఎప్పుడు? దీని ప్రత్యేకత ఏంటి?

వృషభరాశి
ఇదే రాశిలో వరుణుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో వృషభరాశి వారికి మంచి గడియలు ప్రారంభం కానున్నాయి. మీ కెరీర్ లో ఊహించని పురోగతి ఉంటుంది. అదృష్టం తలుపు తడుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

Also Read:Vinayaka Chavithi 2025-వినాయక చవితి పూజలో దోసకాయ ఎందుకు పెడతారో తెలుసా?

కన్యా రాశి
వరుణుడి తిరోగమనం కన్యా రాశి వారి ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. పేదరికం నుండి బయటపడతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అఖండ ధనలాభం ఉంటుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. మిమ్మల్ని అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా వరిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad