Saturday, November 15, 2025
HomeదైవంNext Eclipse 2025: తర్వాత గ్రహణం ఎప్పుడు? అది ఇండియాలో కనిపిస్తుందా?

Next Eclipse 2025: తర్వాత గ్రహణం ఎప్పుడు? అది ఇండియాలో కనిపిస్తుందా?

Next Eclipse In India 2025: మనం జీవితాల్లో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువులు వీటిని అశుభంగా భావిస్తారు. ఈ క్రమంలో ఆదివార నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. దీంతో ఈ ఏడాది తర్వాత గ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సంవత్సరం చివరి మరియు రెండో సూర్యగ్రహణం సెప్టెంబరు 21న సంభవించబోతుంది. ఈసారి ఏర్పడబోయేది పాక్షిక సూర్యగ్రహణం. ఇది నెల వంక ఆకారంలో కనిపించనుంది. అయితే ఇది ఇండియాలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా పాటించబడదు. సాధారణంగా గ్రహణానికి 12 గంటల ముందు సూతకం మెుదలవుతుంది.

- Advertisement -

ఇది ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?
ఈసారి సంభవించబోయే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, న్యూజిలాండ్, ఓషియానియా మరియు దక్షిణ పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు సెప్టెంబర్ 21, 2025న ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం రాత్రి 11:00 గంటలకు ప్రారంభమై.. తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం విషువత్తుకు ముందు రోజు సంభవించబోతుంది. అందుకే దీనిని “విషువత్తు సూర్యగ్రహణం” అని పిలుస్తారు. పగలు మరియు రాత్రి సమానంగా ఉండే రోజునే విషువత్తు అంటారు.

Also Read: Vastu Tips -కుబేరుడి కటాక్షం పొందాలంటే.. ఇంటి ఉత్తర దిశలో ఈ వస్తువులు పెట్టండి..

రాశులపై గ్రహణ ప్రభావం
ఇది భారత్ లో కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఈ గ్రహణం వల్ల వృషభం, తుల, కర్కాటకం మరియు వృశ్చిక రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. కెరీర్ లో అనేక అడ్డంకులు ఉంటాయి. ఇతరులతో సంబంధాలు దెబ్బతింటాయి. మరోవైపు మిథునం, మీనరాశులవారిని కూడా సమస్యలు వెంటాడుతాయి. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ధనస్సు రాశివారు కూడా సందిగ్ధ స్థితిలో ఉంటారు. గ్రహణ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన న్యూస్ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad