November 2025 Luck Zodiac Signs: పండుగలు, గ్రహ సంచారాల నవంబర్ నెల శుభప్రదమైనది. ఈ మాసంలో గురుడు, కుజుడు, శుక్రుడు మూడు అరుదైన యోగాలను సృష్టించబోతున్నాయి. కర్కాటక రాశిలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల శక్తివంతమైన హంస మహాపురుష యోగం, కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల రుచక మహా పురుష యోగం, శుక్రుడు కూడా తన స్వక్షేత్రమైన తులా రాశిలో గోచరించడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడబోతున్నాయి. దీని ప్రభావం వల్ల నవంబరులో ఆరు రాశులవారు నక్కతోక తొక్కబోతున్నారు.
తుల రాశి
నవంబరులో తులా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అధికార యోగం పడుతోంది. మీరు త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. వృత్తి, ఉద్యోగం రీత్యా విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు ఊహించని లాభాలు ఇస్తాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి టైం. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
మకర రాశి
రాజయోగాలు మకరరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాయి. మీరు సమాజంలో మంచి పొజిషన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కెరీర్ లో అద్బుతమైన పురోగతి ఉంటుంది.
మేష రాశి
మూడు అరుదైన మహాపురుష రాజయోగాల వల్ల మేష రాశి వారు ఊహించని బెనిఫిట్స్ పొందుతారు. మీ సంపద భారీగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. విదేశాల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి.
వృషభ రాశి
ఈ రాశి వారికి రుచక, మాలవ్య రాజయోగాలు కలిసి వస్తాయి. నవంబరులో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వివాహా యోగం ఉంది. ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కర్కాటక రాశి
రాజయోగాలు కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. మీరు కష్టనష్టాల నుంచి బయటపడతారు. జాబ్ చేసేవారి శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మీ ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది.


