నిర్మల్ టౌన్ (తెలుగు ప్రభ): కళలకు నిలయంగా పేరు ప్రముఖంగా పేరు ఉన్న నిర్మల్ జిల్లా కేంద్రంలో పలువురు కళాకారులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కొయ్యబొమ్మలకు పేరు గాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలను చేసే వారే కాకుండా బియ్యపు గింజలపై చిత్రాలను చిత్రించే వారు ఉన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సిమెంట్ రాజకీయ నాయకుల, దేవతా విగ్రహాలు తయారు చేసే వారు సైతం ఉన్నారు. అయితే బోలెండంత మంది కళాకా రులున్నా పొట్టకూటి కోసం కొట్టుమిట్టాడే వారే అధికం. పట్టణంలోని నాయుడివాడ, కమల్ రోడ్ లలో కొన్ని కుటుంబాలు 55 సంవత్సరాలతో నమ్ముకున్న కళను పెద్దోలు ఇచ్చిపోయిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కలమ్మ తల్లి సేవలో నిమగ్నమైపోతూనే ఉన్నారు.
శాస్త్రీయ పద్ధతులలోనే వినాయకులకు రూపాలు..
తాము మాత్రం తమ పెద్దలు సూచించిన శాస్త్రీయపద్ధతుల్లోనే గణపతులను తయారు కున్న ఈ కళను వదులక వచ్చే లాభంతోనే సంవత్సరం అంతా తమ కుటుంబ పోషణను వెళ్ళదీస్తున్నామని చెప్పారు. నాయుడివాడ వీధిలో నాలుగు గణపతుల తయారీ కేంధ్రా లుండగా, ఒక్కొక్క కేంద్రంలో పన్నెండు మంది తమ గురువులతో పాటు కలిసి పనిచేస్తున్నారు. ఈ మధ్య శాస్త్రీయ బద్ధమైన విధా నాలకు ప్రాధాన్యత లేకుండా పోతున్నదని ఫ్యాషన్ పద్దతులలో గణపతులను తయారు చేస్తేనే పలువురు ముందుకు వస్తున్నారని, కాని ఇది సాంప్రదాయిక విధానాలకు విరుద్ధమని ప్రతీ దానికి వినాయకులకు తుది మెరుగులు దిద్దుతున్న కళాకారులు నానా ఇబ్బందులు వస్తుందని తెలిపారు.
ఆయా పేర్లతో వినూత్నమైన రూపాయలతో..
గణపతుల నమూనాలలో మార్పులేమి లేవని, ఎత్తు మాత్రమే పెరుగుతున్నదన్నారు. గణపతు లతో పాటు చిత్రకళ, సిమెంట్ తోను దేవతల విగ్రహాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే లంబో ఆకారం (భారీ బొజ్జగణప య్య), ఏకదంతం (ఒక దంతం), గజముఖం ( ఏనుగు ముఖం) వామనమూర్తి లాంటి రకరకాల గణపతులను చేస్తున్నామని వీటి నిర్మాణానికి ముడి సరుకు కొబ్బరిబూరు, కంకమా, బద్దలు,చిత్తు కాగితాలు, గడ్డి, బంక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పలు రకాల రంగులు అవసర ముంటాయని చెప్పారు.
నయా పైసా ప్రభుత్వ సహాయం లేకుండానే..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు సంబంధిత శాఖల అధికారుల కాలవేలపడ్డ తమకు ఇప్పటివరకు నయా పైసా సాయం అందలేదని కళాకారులు వాపోయారు. ఆయన పేర్లతో పథకాలు ఉన్న ఆన్ లైన్ ల ఆర్థిక ఇతర సహాయాల కోసం దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్న తమకి ఇప్పటివరకు ఆ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదని సంబంధిత శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగతంగా విగ్రహాల తయారీకి తగిన విధంగా ఖర్చులు పెట్టి విగ్రహాలు తయారు చేస్తూనే మరో 15 నుంచి 20 మందికి తమ విగ్రహాల నిర్మాణ శిబిరాలలో ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు. వృత్తి లేదా కులం ఆధారంగా తమకు సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విగ్రహాల తయారీలో పెరిగిన పోటీ.. అంతర్రాష్ట్ర కళాకారుల తయారీ శిబిరాలతో భారీ నష్టం
గణపతుల విగ్రహాలను తయారు చేయడమే తమ జీవనోపాధిగా గడుపుతున్నారు. ప్రతి ఏట వేలాది విగ్రహాలను వీరు తయారు చేసి విక్రయిస్తుంటారు. ప్రతీ ఏటా వినాయక చవితికి నాలుగైదు నెలల నుండే తాము చేసే గణపతుల పనులను వేగవంతం చేసుకుని చవితి నాటికి తుది మెరుగులు దిద్దుతారు. అయితే ఈ మధ్య గణపతి విగ్రహాల తయారీలో పెరిగిపోయిన పోటీ కారణంగా తమ శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంలేదని విగ్రహాల తయారీ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సమయాలలో తాముపెట్టే పెట్టుబడి కూడా దక్కడం లేదని వారు వివరించారు. ఇది తమ ను మానసిక వేదన కు గురి చేస్తున్నదని పేర్కొన్నారు.తాము గతంలో కంటే ఈ మధ్య గణపతుల సైజులను పది ఇంచుల నుంచి 15 ఫీట్ల వరకు పెంచామని మరిన్ని ఫీట్లు పెంచి భారీ గణపతులను కూడా తయారు చేస్తామన్నా అధిక ఖర్చులు, ఇబ్బందులతో చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఖర్చులతో కూడిన పని కాబట్టి, ఆర్థిక స్థోమత లేక భారీ గణపతులను తయారు చేయలేక పోతున్నామన్నారు. ఏడాదిలో పది నెలల పాటు ఈ పనుల లోనే నిమగ్నమై ఉంటామని నిర్మాణ సామగ్రిలో చాలా వస్తువులు ఇప్పటికీనిర్మల్ దొరకకపోవడంతో హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ ,బెంగళూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయవలసి వస్తున్నదని తెలిపారు.
వినాయక విగ్రహాల తయారీ.. కరువవుతున్న ఆదరణ – విశ్వనాథ్, గణపతుల నిర్మాణదారుడు, నాయుడివాడ, నిర్మల్
కళలకు పుట్టినిళ్ళు అయినా నిర్మల్ లో కళలకు కనీస ఆదరణ లేదని, ప్రతీ ఏటా లక్షలాది రూపాయల పెట్టు బడి పెట్టి స్థానికంగానే ఎన్నో గణపతులను తయారు చేస్తున్నా కొంత మంది హైదరాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ లేదా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ల వారు తయారు చేస్తున్న విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వాపోయారు. నిర్మల్ జిల్లా కేంద్రం కాకుండా దూర ప్రాంతాల నుండి విగ్రహాలు తీసుకురావడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని దూర ప్రాంతాలను గణపతులను తెచ్చేటప్పుడు పగులడమో, కలర్ ఊడఢమో జరుగుతుందన్నారు. అప్పుడప్పుడు ప్రమాదాలు పెరుగుతాయన్నారు. స్థానికులు కోరుకున్న విధంగా గణపతులను తయారు చేయడానికి తాము సిద్ధమేననిచెప్పారు.
అమ్మకాలు సరిగా లేవు.. కె. వెంకటరమణ సీనియర్ కళాకారుడు నాయుడి వాడ నిర్మల్
ప్రజలు గణేష్ ఉత్సవాలను శాస్త్రీయ, సాంప్రదాయ బద్దంగా స్థానికంగా శోభయ మానంగా విగ్రహాలను తయారు చేస్తున్నా మండలుల వారు, కొనుగోలుదారులు ఆర్భాటాలు, అలంకరణలు, హంగామాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ వేలాది రూపాయ లను ఖర్చులు చేస్తారు కాని గణేషుని విగ్రహం కొనేటప్పుడు తక్కువ ఖర్చు చేయాలని చూడటం విచారకరం. అంతేకాకుండా తాము లక్షలలో పెట్టుబడి పెట్టి గణపతులను తయారు చేస్తే వచ్చే లాభాలు మాత్రం అత్యల్పమని వాపోయారు.
దుర్గాదేవి విగ్రహాలను కూడా చేస్తా.. సురేష్ కళాకారుడు..
తను 45 ఏండ్ల నుండి గణపతులను చేస్తున్నానని. ఈ ఉత్సవాలు ముగియగానే ప్రతీ యేడు పది హేను నుంచి ఇరువై దుర్గాదేవి విగ్రహాలను కూడా తయారు చేస్తానని ప్రముఖ కళాకారుని విగ్రహాల తయారుదారురాలు రోహిణి తెలిపారు. విగ్రహాల ఉపాధి తమకు ప్రధాన జీవన ఉపాధి అదే తమ కుటుంబ పోషణ భారానికి మూల ఆధారమని రోహిణి పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎన్నోసార్లు కాళ్లరిగేలా తిరిగినా అందిన సాయం అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.



