ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ సీతారాముల కల్యాణ వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలసి సమర్పించారు.
- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏకశిలా నగరి కోదండరామ స్వామి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దర్శనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులకు వేద పండితులు,అర్చకులు,టిటిడి దేవస్థాన సిబ్బంది, అధికారులు ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.