Saturday, November 15, 2025
HomeదైవంOnam 2025: ఓనం పండుగ ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Onam 2025: ఓనం పండుగ ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

- Advertisement -

Onam 2025 date and significance: కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే ఫెస్టివల్స్ లో ఇది ఒకటి. దాన కర్ణుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఇది 12 రోజులపాటు జరుపుకునే పండుగ. ఇది ఎంతో చారిత్రాత్మక, సాంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సంవత్సరం ఓనం పండుగను సెప్టెంబరు 5న జరుపుకోనున్నారు. తిరువోణం అని పిలువబడే రోజునే బలి వస్తాడంటారు. ఆ రోజే ప్రధాన వేడుకను చేసుకుంటారు.

ఓనం 2025 పండుగ తేదీలు:

ఆగస్ట్ 26, 2025 అథాచమయం, అత్తపూ పూక్కలం

ఆగస్ట్ 27, 2025 – చితిర రోజు

ఆగస్ట్ 29, 2025 – చోడి డే

ఆగస్టు 30, 2025 – విశాఖ దినోత్సవం

ఆగస్ట్ 31, 2025 అనిజం డే, వల్లం కాళి (స్నేక్ బోట్ రేస్)

సెప్టెంబర్ 1, 2025 – త్రికేత దినం

సెప్టెంబర్ 2, 2025 మూలం రోజు, ఓనం సద్య, పులికలి, కైకొట్టికలి

సెప్టెంబర్ 3, 2025 పూరడం డే, ఓనతప్పన్

సెప్టెంబర్ 4, 2025 ఉత్రాదం రోజు, మొదటి ఓనం (ఉత్రడప్పచ్చిల్)

సెప్టెంబర్ 5, 2025 తిరువోణం రోజు, రెండవ ఓణం (ప్రధాన వేడుక)

సెప్టెంబర్ 6, 2025 అవిట్టం రోజు, మూడవ ఓనం, త్రిస్సూర్ పులికలి

సెప్టెంబర్ 7, 2025 చాతాయం రోజు, నాల్గవ ఓనం

ఓనం ఎలా జరుపుకుంటారు?

కేరళ సాంస్కృతికి అద్దం పట్టే పండుగ ఓనం. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీ ప్రజలు ఈరోజున తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలీలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖీర్, పులిస్సేరి వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తారు. ప్రతి కుటుంబం ఓనం సద్యను తయారు చేస్తాయి. ఈ శాఖాహార భోజనం 20కిపైగా వంటకాలు ఉంటాయి.

Also Read: Blood Moon 2025- బ్లడ్ మూన్ ఎప్పుడు? ఇది మన దేశంలో కనిపిస్తుందా?

ఈ పండుగను పురస్కరించుకుని కథాకళి నృత్యం, వల్లం కలి(బోట్ రేస్) వంటివి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు కైకొట్టికలి, తుంబి తుల్లాల్ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈరోజున మగవారు చొక్కా, ముండు అని పిలువబడే లుంగీ ధరిస్తారు. స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఓనం కేరళలో వ్యవసాయ పండుగ. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు కూడా ఇస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య) వంటి ఆటల్లో పాల్గొంటారు.

Also Read: Pithori Amavasya 2025- పిథోరి అమావాస్య ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి?

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad