తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీపద్మావతి అమ్మవారికి టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎనిమిదో రోజున రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మహారాణీ అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. టిటిడి ఈవో చేతులు మీదుగా టిటిడి చైర్మన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.