పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అంగరంగం వైభవంగా జరిగింది. పాలకుర్తి గ్రామంలో వీధి వీధిన మహిళలు కోలాటం ఆడుతూ మంగళ హారతులతో కొబ్బరి కాయలతో భక్తులు స్వాగతం పలికారు.
- Advertisement -
అదేవిధంగా గుట్ట చుట్టూ ఏడ్ల బండ్లు, వాహనాలు తిరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, దేవస్థాన డైరెక్టర్లు కృష్ణమాచార్యులు, బోనగిరి సాగర్, పన్నీరు వెంకన్న హరీష్,దేవగిరి రమేష్, మట్టాగజం నాగరాజు, దేవగిరి అనిల్, సూపర్ డెంట్ వెంకటయ్య, శ్రీనివాస్ రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.