పాములపాడు మండలంలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే శివ స్వాముల కొరకు కే.జీ. రోడ్డు వెంట ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ఈ.వీ. నాగలక్ష్మి దేవి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి-ఇ.వి.నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ జూటూరు సాయిబాబా దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఏఎన్ఎం ఐ.శ్వేత, రుద్రవరం ఆశ వర్కర్ ముద్రగడ. లక్ష్మీదేవి, తుమ్మలూరు ఆశ వర్కర్ జి. లలితమ్మ, అదేవిధంగా పాములపాడు వైద్యశాల దగ్గర ఎంపీహెచ్ఏ (ఫిమేల్)- వై.ఆశీర్వాదమ్మ, ఆశ వర్కర్లు- కే.వెంగమ్మ, ఏ.నాగమణి, మొగీలీశ్వరమ్మ, విజయ్ కుమారి, ఆయా సచివాలయాల ఏఎన్ఎంలు పాదయాత్ర చేసే శివ స్వాములు తదితరులకు వారి అనారోగ్య ఇబ్బందులు తెలుసుకొని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు.

సీరియస్ కేసులు ఏమైనా ఉంటే పాములపాడు పీహెచ్సీ గానీ, ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గానీ 108 అంబులెన్స్ ద్వారా తరలిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.