Saturday, November 15, 2025
HomeదైవంVastu Sastram: బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచవచ్చా..లేదా!

Vastu Sastram: బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచవచ్చా..లేదా!

Papaya Tree VS Vastu: వాస్తు శాస్త్రం అనేది భారతీయ సంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన విభాగం. ఇల్లు నిర్మించేటప్పుడు గదుల స్థానాల నుండి మొదలుకుని, ఇంట్లో ఉంచే వస్తువులు, మొక్కలు, చెట్ల వరకు అన్ని అంశాల్లో వాస్తు మార్గదర్శకాలు ఉంటాయి. మన జీవనశైలికి, ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి వాస్తు ప్రభావం ఉంటుందని విశ్వాసం. అందుకే ఇళ్లు నిర్మించేటప్పుడు మాత్రమే కాకుండా, ఇంట్లో పెంచే మొక్కల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతారు.

- Advertisement -

పాజిటివ్‌ ఎనర్జీని పెంచడానికీ..

ఇంట్లో మొక్కలు పెట్టడం అంటే కేవలం అందం కోసం మాత్రమే కాదు, పాజిటివ్‌ ఎనర్జీని పెంచడానికీ కారణమవుతుంది. పచ్చదనం చుట్టూ ఉంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అయితే ప్రతి మొక్కను ఇంట్లో పెంచడం వాస్తు ప్రకారం శుభదాయకం కాదు. కొన్నివి పవిత్రమైనవి అయినప్పటికీ, అవి ఇంటి ముందర ఉంటే సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. అందులో బొప్పాయి చెట్టుకి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది.

బొప్పాయి చెట్టు ఇంటి ముందు భాగంలో..

బొప్పాయి చెట్టు ఇంటి ముందు భాగంలో ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇల్లు ఎదురుగా ఈ చెట్టు పెరిగితే ఆర్థిక కష్టాలు రావచ్చని, కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చని వారు అంటారు. అదేవిధంగా ఆ ఇంట్లో ప్రశాంతత తగ్గి, సౌఖ్యం దూరమవుతుందని చెబుతారు. చాలా సందర్భాల్లో బొప్పాయి చెట్టును పూర్వీకుల ఆవాసంగా కూడా భావిస్తారు. అందువల్ల చాలా మంది ఇంటి గుమ్మం ముందు ఈ చెట్టు ఉండకుండా చూసుకుంటారు. ఒకవేళ మన అనుమతి లేకుండా విత్తనం పడిపోయి చెట్టుగా మారితే దానిని తీసి ఇంటి వెనుక భాగంలో లేదా వేరే ప్రదేశంలో నాటాలని సిఫార్సు చేస్తారు.

ఇంట్లో పెట్టకూడదనే…

వాస్తు కారణాల వల్ల బొప్పాయి చెట్టును ఇంట్లో పెట్టకూడదనే అభిప్రాయం ఉన్నా, బొప్పాయి పండుకు మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండిన బొప్పాయిలో పపైన్‌ అనే ఎంజైమ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ప్రోటీన్లను శరీరం సులభంగా విభజించుకోవడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

విటమిన్‌ సీ..

అదేవిధంగా బొప్పాయిలో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. దీని వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా వచ్చే జలుబు, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. బొప్పాయి పండులో లైకోపీన్‌, బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడంలో, రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి హృద్రోగాల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

ఇంకా బొప్పాయిలో ఉండే ఫైటో కెమికల్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం నియంత్రణలో కూడా బొప్పాయి ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్‌ స్థాయులను తగ్గించడంలో దాని పాత్ర ముఖ్యమైనది.

Also Read: https://teluguprabha.net/devotional-news/astrological-luck-for-three-zodiac-signs-in-august-17-to-19/

సౌందర్య పరంగా కూడా బొప్పాయి పండు ఎంతో విలువైనది. ఇందులోని పోషకాలు కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మెరుగు పరుస్తాయి. ముడతలు తగ్గి యవ్వన కాంతి నిలుపుకోవడానికి సహాయపడతాయి. అదేవిధంగా పపైన్‌ ఎంజైమ్‌ గాయాలను త్వరగా నయం చేయడంలో తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad