Paush Amavasya in December 2025: హిందూ మతంలో పుష్య మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర భారత పంచాంగం ప్రకారం, ప్రస్తుతం పుష్య మాసం నడుస్తోంది. ఈ మాసంలో వచ్చే అమావాస్యనే పౌష్ అమావాస్య లేదా పుష్య అమావాస్య అని అంటారు. ఈరోజున పితృదేవతలకు పిండ ప్రదానం, శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా ఈరోజున మన పూర్వీకుల పేరిట దానం చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. ఈ నెలంతా శ్రీమహావిష్ణువుతోపాటు సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాంటి విశిష్టత కలిగి పుష్య అమావాస్య ఈ ఏడాది ఎప్పుడు వస్తుందో తెలుసా?
పుష్య అమావాస్య తిథి, శుభ ముహూర్తం
క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం పుష్య మాస అమావాస్య తిథి డిసెంబర్ 19న తెల్లవారుజామున 4: 58 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20, శనివారం ఉదయం 7: 11 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం తిథి ప్రకారం, పౌష్ అమావాస్యను డిసెంబర్ 19న జరుపుకుంటారు. ఇదే రోజు ఉదయం 5: 19 నుండి 6: 14 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేయడం మంచిది. అదే రోజు రాత్రి 11: 58 గంటల నుండి మధ్యాహ్నం 12: 39 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం దాతృత్వానికి అనువైనదిగా భావిస్తారు.
Also Read: Pradosh Vrat -2025లో చివరి ప్రదోష వ్రతం ఎప్పుడో తెలుసా?
ఈ పవిత్రమైన రోజున లాభ-ఉన్నతి ముహూర్తం ఉదయం 8: 26 నుండి 9: 43 వరకు, అమృత-సరోవత్తమ ముహూర్తం ఉదయం 9: 43 నుండి 11: 01 వరకు ఉంటుంది. పుష్య అమావాస్య నాడు శూల యోగం ఉదయం నుండి మధ్యాహ్నం 3: 46 గంటలకు వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం నుండి రాత్రి 10: 52 గంటల వరకు ఉంటుంది. తర్వాత మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆస్ట్రాలజీలో జ్యేష్ఠ మరియు మూల నక్షత్రాలను ఆధ్యాత్మికతకు, శ్రాద్ధకర్మలకు, ఆరాధనకు శుభ సూచికంగా పరిగణిస్తారు.
పుష్య అమావాస్య ప్రాముఖ్యత
ఈరోజున ఉపవాసం ఉండి పూర్వీకులకు శ్రాద్ధం మరియు తర్పణం చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరటమే కాకుండా మీ జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఈ శుభకరమైన రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల తరగనంతా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. తులసి మెుక్కను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున దానధర్మాలు చేయడం, భగవద్గీత పఠించడం, రావిచెట్టు వద్ద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
Also Read: Kalashtami-2025లో చివరి కాలాష్టమి నేడే.. ఏమిటి దీని ప్రత్యేకత?

