Sunday, October 6, 2024
HomeదైవంPeddakadaburu: కమనీయం, రమణీయం శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం

Peddakadaburu: కమనీయం, రమణీయం శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం

రథోత్సవంలో వివిధ పార్టీ నాయకులు

మండల కేంద్రమైన పెద్దకడబూరులో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం అశేష భక్తజన వాహినుల నడుమ మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శ్రీ శ్రీ శ్రీ సిద్ధారూఢ స్వామికి ఉదయం నుండి స్వాముల వారికి ఆకు పూజ కుంకుమార్చన, పంచామృతాభిషేకం, బిల్వర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవాన్ని అతి సుందరంగా అలంకరించడానికి ఉదయం 11 గంటల సమయం మధ్య దేవాలయం నుండి రథం కలసాన్ని, పూలహారాలు, ఊరేగింపుగా డప్పు వాయిదాలతో రథం వద్దకు తీసుకొచ్చారు.

- Advertisement -

శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవాన్ని పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి ఆలయము నుండి ఉచ్చాయి రథోత్సవం మీదుగా ఉత్సవ మూర్తులను పురవీధుల గుండా వాయిద్యాలతో ఊరేగింపుగా బస్టాండ్ ఆవరణంలో ఉన్న శ్రీ శ్రీ సిద్ధారుడా స్వామి రథోత్సవం వద్దకు తీసుకు వచ్చారు. శ్రీశ్రీశ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉత్సవ మూర్తులను రథోత్సవం పై ప్రతిష్టించారు. అనంతరం మాజీ విఆర్వో రామలింగారెడ్డి ఇంటి నుండి పూర్ణకుంభం కలసంను డప్పు వాయిద్యాలు మేళ తాళాలతో పురవీధుల గుండా ఊరేగింపుగా శ్రీ శ్రీ శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం వద్దకు తీసుకు వచ్చారు.

శ్రీ శ్రీ సిద్ధారుడా స్వామి రథోత్సవం వద్ద మాజీ విఆర్వో రామలింగారెడ్డి,రాష్ట్ర వైసిపి యువజన నాయకులు వై. ప్రదీప్ రెడ్డి,జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,టిడిపి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి,టిడిపి రాష్ట్ర యువజన నాయకులు దివాకర్ రెడ్డి, రథోత్సవముకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే సొసైటీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి,ఎంపీపీ శ్రీవిద్య,జేఏసీ కన్వీనర్ రవిచంద్ర రెడ్డి,శివారెడ్డి,దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్, హనుమపురం సర్పంచ్ ఈరన్న,స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు శేషగిరి జోషి వేద మంత్రాలు సాక్షిగా శ్రీ శ్రీ సిద్ధారుడ స్వామి రథోత్సవం అశేష భక్తుల జనవాహినుల నడుమ కన్నుల పండుగగా రథోత్సవం జరిగింది.

స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.ఈ రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్దకడబూరు ఎస్ఐ.మహేష్ కుమార్,కోస్గి సీఐ,గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యం. రామాంజనేయులు,మాజీ ఎంపీపీ రఘురాం,జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు నరవ శశిరేఖ,వైస్ సర్పంచ్ విజయేంద్ర రెడ్డి,టిడిపి నాయకులు మధుసూదన్ రెడ్డి, నరవ రాజశేఖర్ రెడ్డి,నవీన్ రెడ్డి,జె.ముక్కరన్న,కోస్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బి. ఆర్లప్ప,టీడీపీ బిసి రాష్ట్ర సాధికార కమిటీ మెంబర్ మల్లికార్జున,టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు కోడిగుడ్ల ఏసేపు,మీసేవ ఆంజనేయులు,బొగ్గుల భాష,వైసిపి మోట్రూ దస్తగిరి, డీలర్ శాంతిరాజు,డీలర్ రామాంజనేయులు,టీడీపీ తలారి అంజి,ఎంజి నరసన్న, ఆర్ టి ఎస్ కన్వీనర్ దశరథ రాముడు,వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు శ్రీ శ్రీ శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవంను తిలకించేందుకు తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News