Monday, February 24, 2025
HomeదైవంPeddapalli: తెలంగాణ శ్రీశైలం ఓదెలలో మల్లన్న కళ్యాణం

Peddapalli: తెలంగాణ శ్రీశైలం ఓదెలలో మల్లన్న కళ్యాణం

ఓదెల మల్లన్న..

పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి, అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కుటుంబ సమేతంగా తిలకించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లన్న స్వామి దయతో పెద్దపల్లి ప్రాంత ప్రజలందరు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News