Guru Shani yuti 2025 effect: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చి వేరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. అలాంటి సమయంలో అవి వేరొక గ్రహంతో సంయోగం చెంది శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తాయి. జూలై నెలలో దేవగురు బృహస్పతి, కర్మఫలదాత శనిదేవుడి అపూర్వకలయిక జరగనుంది. దీంతో నాలుగు రాశులవారిపై కనకవర్షం కురవబోతుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. వీరు ఏ కార్యం తలపెట్టినా సఫలత పొందుతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
బృహస్పతి, శనిదేవుడు కలయిక ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరికి లక్షీదేవి కటాక్షం లభిస్తుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయి. తల్లిదండ్రులకు మనవళ్లు, మనవరాళ్లతో గడిపే రోజుల రానున్నాయి. మీరు ఎల్లప్పుడూ ఫిట్ గా ఉంటారు. ఈ రాశికి చెందిన యువతీ యువకులు ప్రేమలో పడతారు. లైఫ్ పై క్లారిటీ వస్తుంది. బంగారం కొనేవారికి ఇదే మంచి సమయం.
మిథున రాశి
మిథున రాశి వారికి శనిదేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కోరిక సిద్ధిస్తుంది. మీకు మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. మీ దాంపత్య జీవితం చూడముచ్చటగా ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. పెళ్లి సంబంధాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి.
వృషభ రాశి
గ్రహాల కలయిక వృషభరాశి వారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. వీరి కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో చేసే ఇన్వెస్ట్ మెంట్స్ లాభాలను పెంచుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుల భారం తొలగిపోతుంది.
తుల రాశి
జూలై నెలలో తులరాశి బాగా లాభపడనున్నారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ కోరికలన్నీ ఫలిస్తాయి. సంతాన యోగం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ఏదైనా ఇల్లు లేదా కారు లేదా బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. నచ్చిన వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. చెడు అలవాట్లు దూరమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ధనార్జన చేస్తారు. లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.