Lucky Zodiac Signs in August 2025: గ్రహాల సంచారం పరంగా రాబోయే ఆగస్టు నెల అద్భుతంగా ఉండబోతుంది. ఈ మాసంలో కొన్ని కీలక గ్రహాల కాలగతిలో పెను మార్పు సంభవించబోతుంది. నెల ప్రారంభంలోనే గ్రహాల యువరాజైన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఆగస్టు 06న కుజుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా శ్రావణ మాసం ఆగస్టు 23 వరకు ఉండబోతుంది. ఇన్ని శుభపరిణామాలు ఐదు రాశులవారికి కలిసిరాబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషరాశి
ఆగస్టులో సంభవించబోయే గ్రహాల కాలగతిలో మార్పులు మేషరాశి వ్యక్తులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుంది. ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి
వచ్చే నెలలో జరగబోయే గ్రహ సంచారాల వల్ల కర్కాటక రాశి వారు శుభవార్తలు ఉంటారు. మీరు ఏ పని చేపట్టినా దానిని సక్సెస్ పుల్ చేస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభిస్తాయి. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.
సింహరాశి
గ్రహాల సంచార సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరగనుంది. మీ జీవితంలో ప్రతికూలత తొలగి సానుకూలత రానుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీ ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
తులా రాశి
కెరీర్ పరంగా తులరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడటమే కాకుండా..వ్యాపారాన్ని విస్తరిస్తారు. అప్పుల బాధ నుండి బయటపడతారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది.
ధనస్సు రాశి
గ్రహాల రాశి మార్పు ధనస్సు రాశివారికి ఎంతో మేలు చేయబోతుంది. ఆగస్టులో వీరు ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.


