Saturday, November 15, 2025
HomeదైవంPlants Vastu: మీ ఇంటికి కటిక దరిద్రాన్ని తెచ్చే మొక్కలు ఇవి...వెంటనే తీసిపారేయండి!

Plants Vastu: మీ ఇంటికి కటిక దరిద్రాన్ని తెచ్చే మొక్కలు ఇవి…వెంటనే తీసిపారేయండి!

Home Vastu-Plants:ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఆ ఇంటి అందం మరింత ఆహ్లాదంగా,ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది తమ ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచేందుకు పూల మొక్కలు, ఆకుల మొక్కలు, అలంకార మొక్కలు పెట్టి పెంచుతుంటారు. మొక్కలు వాతావరణాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆక్సిజన్‌ కూడా అందిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి మొక్కను ఇంట్లో పెట్టడం మంచిదని చెప్పలేకుండా ఉన్నాం. కొన్ని రకాల మొక్కలు ఇంటి శాంతి, ఆర్థిక స్థితి, ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

వాస్తు ప్రకారం మొక్కలను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఎందుకంటే మొక్కలు కూడా శక్తిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావగా, మరికొన్ని ప్రతికూల శక్తిని ప్రసరింపజేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా చింత చెట్టు, గోరింటాకు మొక్క, ఎండిన మొక్కలు, నల్ల తుమ్మ చెట్టు వంటి వాటిని ఇంట్లో పెంచడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/lucky-palm-signs-and-their-meanings-in-palmistry/

చింత చెట్టు..

మొదటగా చింత చెట్టు గురించి మాట్లాడితే, ఈ చెట్టును ఇంటి వద్ద కానీ, ఆవరణలో కానీ నాటరాదని వాస్తు నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. చింత చెట్టు బలమైన నీడనిచ్చే చెట్టు అయినా, ఇది ఇంటి వద్ద ఉంటే ఆర్థిక ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు వస్తాయని చెబుతారు. అదేవిధంగా, ఇంటిలో శాంతి తగ్గిపోతుందని కూడా చెబుతున్నారు. చింత మొక్క నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కారణంగా కుటుంబంలో తగాదాలు, ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

గోరింటాకు మొక్క..

గోరింటాకు మొక్క గురించి మాట్లాడితే, ఇది చాలా మందికి ఇష్టమైన మొక్క. అందం కోసం, ఆచారాల కోసం చాలా మంది గోరింటాకు పెంచుకుంటారు. కానీ వాస్తు దృష్టిలో ఈ మొక్కను ఇంట్లో ఉంచడం శుభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోరింటాకు మొక్క వద్ద ప్రతికూల శక్తులు ఉండే అవకాశం ఉందని, దీని కారణంగా ఇంటిలో ఆర్థిక సమస్యలు లేదా పేదరికం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి లోపల గానీ, ఆవరణలో గానీ ఉంచరాదు.

ఎండిపోయిన మొక్కలు..

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు మొక్కలు ఎండిపోయిన తర్వాత కూడా చాలా మంది వాటిని తీసివేయకుండా అలాగే ఉంచుతుంటారు. ఇది వాస్తు ప్రకారం మంచిది కాదట. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని నమ్మకం. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరగవచ్చని చెబుతున్నారు. కాబట్టి మొక్క ఎండిపోయిందంటే వెంటనే దానిని తీసివేయడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల తుమ్మ చెట్టు..

వాస్తు శాస్త్రం మరో ముఖ్యమైన చెట్టును కూడా చెప్పుకోవాలి… అది నల్ల తుమ్మ చెట్టు. ఈ చెట్టును ఇంటి చుట్టూ నాటకూడదని స్పష్టంగా చెబుతున్నారు. వాస్తు నిపుణుల ప్రకారం, ఈ చెట్టు చుట్టూ ఉన్న వాతావరణంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబంలో సమాధానం తగ్గి, విభేదాలు తలెత్తుతాయని చెబుతున్నారు. కొందరు దీన్ని చెడు శక్తులను ఆకర్షించే చెట్టుగా కూడా భావిస్తారు. కాబట్టి ఈ చెట్టును ఇంటి దగ్గర లేదా ప్రాంగణంలో నాటకూడదని సూచన.

Also Read: https://teluguprabha.net/devotional-news/astrological-reasons-why-men-should-pierce-ears/

వాస్తు ప్రకారం, ఇంటిలో లేదా చుట్టుపక్కల నాటే ప్రతి మొక్క శాంతిని, సౌభాగ్యాన్ని తీసుకురావడంలో పాత్ర పోషిస్తుంది. కాబట్టి మొక్కలను ఎంపిక చేసేటప్పుడు కేవలం అందం లేదా వాసనకే ప్రాధాన్యం ఇవ్వకుండా, వాటి వాస్తు ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు శుభఫలితాలను ఇవ్వగలిగిన తులసి, మనిమేక, అలొవెరా వంటి మొక్కలను ఇంట్లో పెంచడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

తులసి మొక్కను..

తులసి మొక్కను ఇంటి ముందుభాగంలో ఉంచితే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా మనీప్లాంట్‌ వంటి మొక్కలు సంపదను ఆకర్షిస్తాయని చెబుతారు. కానీ చింత, గోరింటాకు, ఎండిన మొక్కలు, నల్ల తుమ్మ చెట్టు వంటి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచడం వలన నెగిటివ్ ప్రభావం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad