వైయస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలంలో వెలసిన శ్రీ అవధూత కాశినాయన( Kasinayana) ఆశ్రమం వద్ద ఉన్న వసతి భవనాలను ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టైగర్ జోన్ లో ఆశ్రమం మరియు ఆశ్రమ భవనాలు ఉన్నాయంటూ ఆశ్రమ నిర్వాహకులకు అధికారులు నోటీసులు అందించారు.
దీంతో శుక్రవారం భవనాలను కూల్చివేయొద్దు అంటూ స్వామీజీలు మరియు భక్తులు అడ్డుకుంటున్నారు. భక్తుల ఆందోళన మధ్య కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన చేస్తున్నారు.
తమలాంటి సాధువులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నామన్నారు. ఇప్పటికైనా జ్యోతి క్షేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటున్నామని మీడియాతో తెలిపారు.