Trigrahi yoga on deepavali 2025: మరో వారం రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది. అక్టోబర్ 20న దీపాల పండుగను జరుపుకోవడానికి దేశం మెుత్తం రెడీ అవుతోంది. ఈ శుభకరమైన రోజునే అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది.తులా రాశిలో గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు, యువరాజు బుధుడు, కమాండర్ కుజుడు కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన యోగం వల్ల మూడు రాశులవారికి అదృష్టం వరించనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులా రాశి
ఇదే రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. పైగా ఇది తులారాశి యెుక్క లగ్న స్థానంలో ఏర్పడబోతుంది. మీరు ఏ పని చేపట్టిన దానిని సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారు. ఎన్నో రోజులగా పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
దీపావళి నాడు ఏర్పడబోయే త్రిగ్రహి యోగం వల్ల మకర రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సక్సెస్ అవుతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. జాబ్ చేసేవారు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అప్పుల భారం ఉండదు. ఉద్యోగంలో బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు.
Also Read: Venus Tranit 2025-నవంబరులో శుక్రుడు గమనంలో మార్పులు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
ధనుస్సు రాశి
సూర్యుడు, బుధుడు మరియు కుజుడు చేస్తున్న పవర్ పుల్ యోగం ధనస్సు రాశి వారి తలరాతను మార్చబోతుంది. వీరి ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. బిజినెస్ చేసేవారు మంచి మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు అద్బుతమైన లాభాలను పొందుతారు. కెరీర్ పీక్స్ లో ఉంటుంది.


