Rare Rajyogam on Diwali 2025: ఈ సంవత్సరం దీపావళి పండగ నాడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అలాంటి వాటిలో వైభవ లక్ష్మీ రాజయోగం ఒకటి. కన్యారాశిలో చంద్రుడు, శుక్రుడు కలయిక వల్ల అక్టోబర్ 20న ఈ రాజయోగం రూపుదిద్దుకుంటుంది. దాదాపు ఇది 500 సంవత్సరాల తర్వాత సంభవించబోతుంది. ఈ అరుదైన యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
కుంభరాశి
చంద్ర, శుక్రల కలయిక కుంభరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీ ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు మంచి ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. మీ జీవితంలో సానుకూలత ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. అన్ని కష్టాల నుండి బయటపడతారు. రుణ విముక్తి పొందుతారు.
కన్యా రాశి
వైభవ లక్ష్మీ రాజయోగం వల్ల కన్యా రాశివారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తారు. ఆఫీసులో మీ లీడర్ షిప్ క్వాలిటీస్ కు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పెళ్లికానీ వ్యక్తులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Mars Transit 2025 – వృశ్చిక రాశిలోకి వెళ్లబోతున్న కుజుడు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు, డబ్బే డబ్బు..
మకర రాశి
రాజయోగం వల్ల మకరరాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించవచ్చు. కెరీర్ లో మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జీవితం నలుగురిని ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే వారు సక్సెస్ పుల్ అవుతారు. మీ కష్టానికి తగ్గ ఫలితం లభించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే ఛాన్స్ ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఓ రేంజ్ లో పెరుగుతుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పూర్తిగా నిజమైనదని మేము చెప్పలేం. పాఠకుల ఆసక్తి మేరకు దీనిని ఇవ్వడమైనది. తెలుగు ప్రభ ఈ వార్తను ధృవీకరించలేదు.


