Saturday, November 15, 2025
HomeదైవంPutrada Ekadashi in August 2025: సంతానం లేని దంపతులు పుత్రద ఏకాదశిని ఆచరించాల్సిందే..

Putrada Ekadashi in August 2025: సంతానం లేని దంపతులు పుత్రద ఏకాదశిని ఆచరించాల్సిందే..

- Advertisement -

Putrada Ekadashi 2025 Date and Significance: శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అలాంటి ఏకాదశుల్లో పుత్రదా ఏకాదశి ఒకటి. సంతానం లేని వారు పిల్లలు కోసం ఈ ఏకాదశిని జరుపుకుంటారు. శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే పుత్రద ఏకాదశి అని అంటారు. ఈరోజున లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అయితే ఈ ఏడాది ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం.

పుత్రద ఏకాదశి ఎప్పుడు?

శ్రావణ పుత్రద ఏకాదశి తిథి ఆగస్టు 4న ఉదయం 11:41 గంటలకు ప్రారంభమై..ఆగస్టు 5న మధ్యాహ్నం 1:12 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం,పుత్రద ఏకాదశి పండుగను ఆగస్టు 5, మంగళవారం నాడు ఆచరిస్తారు. ఉపవాసాన్ని ఆగస్టు 6న విరమించాలి. పారాణ సమయం ఉదయం 5:45 మరియు ఉదయం 8:26 గంటల వరకు ఉంటుంది.

పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత

పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. కొత్తగా పెళ్లైన జంటలు ఈ ఏకాదశి చేయడం ఉత్తమంగా భావిస్తారు. పుత్రద ఏకాదశి రోజునే అరుదైన ఇంద్రయోగం, భద్ర యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయాల్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. మీ కోరికలు ఫలిస్తాయి.

Also Read: Janmashtami 2025- ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగష్టు 15నా లేదా 16నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..

పూజా విధానం

ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించండి. అనంతరం ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగా జలంతో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయండి. అనంతరం పీఠంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి శ్రీహరి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించండి. స్వామివారికి గంగాజలం, పంచామృతంతో స్నానం చేయండి. ఆ తర్వాత పువ్వులు, తులసి దళాలు, పండ్లు, స్వీట్లు సమర్పించండి. విష్ణు చాలీసా పఠించి చివరిగా హారతి పట్టండి.

Also read: Raksha Bandhan 2025 – రాఖీ పండుగ నాడు ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి!

 

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad