Radha Krishna Love Story: ప్రేమ, భక్తికి నిలువెత్తు నిదర్శనం రాధ. పురాణాల ప్రకారం, ఈమెను శ్రీకృష్ణుని ప్రేయసిగా భావిస్తారు. అంతేకాకుండా రాధమాతను లక్ష్మీదేవి అవతారంగా పిలుస్తారు. ఈభూమ్మిద శ్రీకృష్ణుడు జన్మించిన పదిహేను రోజులకు రాధాదేవి జన్మించింది. శ్రీకృష్ణుడు స్పర్శ తగిలిన తర్వాత రాధ తన కళ్లను తెరిచిందట. భక్తికి నిలువెత్తు రూపంగా నిలిచే రాధాదేవి జన్మదినమే రాధాష్టమి. భాద్రపత మాసంలోని శుక్లపక్ష అష్టమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజున రాధాదేవిని పూజించడం వల్ల నిండు నూరేళ్లు సౌభాగ్యంతోపాటు అష్టఐశ్వర్యాలతో జీవిస్తారు.
ఈ సంవత్సరం రాధాష్టమి ఆగస్టు 31న జరుపుకోనున్నారు. పూజకు అనువైన సమయంగా ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 1:38 గంటలను భావిస్తారు. రాధాదేవిని గౌడియా వైష్ణవులు ఎక్కువగా పూజిస్తారు. అయితే రాధాదేవి శ్రీకృష్ణుడి ప్రేయసా లేదా భార్య అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. అంతేకాకుండా శ్రీకృష్ణుడు బృందావనం వదిలి వెళ్లిన తర్వాత రాధ జీవితం ఎలా గడిచింది తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కృష్ణుడు బాల్యమంతా బృందావనంలోనే గడిచిందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక్కడ రాధాకృష్ణుల ప్రణయగాధ ప్రారంభమైంది. అయితే శ్రీకృష్ణుడు బృందావనం విడిచివెళ్లిన తర్వాత రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఈ క్రమంలో అతడు ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. వారే రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, భద్ర, మిత్రవింద, నాగ్న జిత్తి, కాళింది, లక్షణ. కానీ రాధను వివాహం చేసుకోలేదు. అయితే బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు రాధను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరి శాశ్వత నివాసం గోలోకాధామమని చెబుతారు. మరికొన్ని పురాణాలు, ఆమె కృష్ణుడు ఉన్నంత కాలం జీవించి తర్వాత ఆయనలోనే లీనమైనట్లు చెబుతున్నాయి.
Also Read: Radha Ashtami 2025 – రాధాష్టమి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి
శ్రీకృష్ణుడు బృందావనం వదిలి వెళ్లిన తర్వాత రాధాదేవి అయాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. రాధ భౌతికంగా మరొకరిని పెళ్లి చేసుకున్నా.. ఆమె ఎల్లప్పుడూ కృష్ణుడినే తలచుకునేదాని చాలా మంది భావిస్తారు.చివరి రోజుల్లో రాధదేవి కృష్ణుడిని చూడాలని ద్వారకకు వెళ్ళి.. అతడి వేణుగానం వింటూనే ప్రాణాలను విడిచిందని చెబుతారు. ఈ సంఘటన తర్వాతే వాసుదేవుడు తన వేణువు విరిచి పారేశాడని గ్రంథాలు చెబుతున్నాయి.
Also Read: Varaha Jayanti 2025 – వరాహ జయంతి రాబోతుంది.. పూజ ఎలా చేయాలో తెలుసా?


