Navpancham rajyog effect in Telugu: ప్రతి గ్రహం కొంత సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తుంది. ప్రస్తుతం రాహు కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు. వచ్చే ఏడాది మెుత్తం కూడా అదే రాశిలో ఉంటాడు. మరోవైపు శుక్రుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి అరుదైన నవపంచమ రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ఊహించని బెనిఫిట్స్ ను పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఈరాశి వారికి నవపంచమ రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీ విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపారులు మంచి రాబడులను పొందుతారు. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు.
తులా రాశి
నవపంచమ రాజయోగం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలు సకాలంలో నెరవేరుతాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీకు డబ్బుకు అస్సలు లోటు ఉండదు. మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ కెరీర్ లో విజయం ఉంటుంది. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. కళలు, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాల్లో ఉన్నవారు లాభపడతారు.
కుంభ రాశి
రాహు-శుక్రుడు సృష్టిస్తున్న నవపంచమ రాజయోగం కుంభరాశి వారి తలరాతను మార్చబోతుంది. బైక్ లేదా కారు కొనాలన్న మీ డ్రీమ్ నెరవేరుతోంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు బాగుంటాయి.


