Rahu Ketu Gochar in November 2025: వేద జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. ఇవి ఎల్లప్పుడూ వక్ర గమనంలోనే ప్రయాణిస్తాయి. రాహు, కేతుల చెడు దృష్టి మీపై పడిందంటే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రస్తుతం పూర్వా భాద్ర నక్షత్రంలో సంచరిస్తున్న రాహువు నవంబర్ 21న శతభిషా నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. ఇదే సమయంలో కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రం మూడో పాదం నుంచి రెండో పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల నక్షత్ర మార్పుల వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది.
తులా రాశి
రాహు-కేతువుల నక్షత్ర మార్పు తులా రాశి వారికి ఎన్నో లాభాలను తీసుకురాబోతుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి రాహు-కేతు సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు మాసిక ప్రశాంతతను పొందుతారు. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. అనేక మార్గాల్లో మీకు ఆదాయం వస్తుంది.
Also Read: Vastu Tips – ఈ 4 వస్తువులను 4 దిక్కులలో పెట్టండి..కుబేరుడికే అప్పు ఇస్తారు!
ధనుస్సు రాశి
రాహు-కేతు సంచారం ధనస్సు రాశి వారికి తలరాతను మార్చబోతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.


