Rahu transit 2026:మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదిలో తమ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం 2026లో గ్రహాల సంచారాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఛాయా గ్రహంగా పిలువబడే రాహువు ఈసారి తన సంచారంతో పెద్ద మార్పులకు దారితీయబోతున్నట్లు పండితులు వివరిస్తున్నారు.
కుంభ రాశి నుండి మకర రాశి..
రాహువు కుంభ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించబోతున్న ఈ కాలం కొన్ని రాశుల వారికి అనూహ్యమైన శుభఫలితాలను అందించే సూచనలున్నాయి.జ్యోతిషశాస్త్రంలో రాహువు శక్తివంతమైన గ్రహంగా చెబుతారు. ఆయన అనుకూలంగా ఉంటే జీవితాన్ని అద్భుతమైన దిశగా మలుస్తాడు, అదే సమయంలో ఆయన ప్రతికూలంగా ఉంటే అనూహ్యమైన అడ్డంకులు కూడా ఎదరవుతాయనే సంగతి తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/devotional-news/simple-friday-lakshmi-remedy-for-financial-prosperity/
అయితే 2026లో జరిగే ఈ మహాసంచారం కొందరి జీవితాలను మార్చేసే విధంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్య, మీన రాశుల వారు ఈ కాలంలో అదృష్టవంతులుగా నిలవబోతున్నారు.
వృషభ రాశి
2026లో రాహువు కరుణ వృషభ రాశి వారికి విశేష ఫలితాలు ఇవ్వబోతుంది. ఇప్పటివరకు స్తంభించి ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. విదేశీ సంబంధాలు ఉన్న రంగాల్లో ఉన్నవారికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలు, ప్రమోషన్లు సాధించే అవకాశం ఉంటుంది.
వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా మారుతుంది, కొత్త ఒప్పందాలు పెద్ద ఆదాయం తీసుకువస్తాయి. కుటుంబంలో సంతోషం, పరస్పర అవగాహన పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. రాహువు ప్రభావంతో మీ నిర్ణయశక్తి పెరుగుతుంది. ఏ విషయం పైనైనా మీరు స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతారు. ఆర్థికపరంగా స్థిరత్వం కలుగుతుంది. గతంలో ఎదురైన నష్టాల నుంచి బయటపడతారు. కొత్త ఆస్తుల కొనుగోలు యోగా ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి 2026 సంవత్సరం మానసికంగా, వృత్తిపరంగా పురోగతిని అందించే సమయం. రాహువు మీ మేధోశక్తిని పెంచి ప్రతీ నిర్ణయంలో ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. విద్యార్థులకు ఇది విజయవంతమైన కాలం అవుతుంది, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గుర్తింపు, ప్రశంసలు, ప్రమోషన్లు లభిస్తాయి.
కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం కావడంతో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొని కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి రాహువు సంచారం నిజమైన శుభవార్తగా మారబోతోంది. ఈ కాలంలో మీరు సంపదను, గౌరవాన్ని రెండింటినీ పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది. కార్యాలయంలో మీ కృషికి గుర్తింపు దక్కి, ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు.
వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాల ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. కుటుంబంలో శాంతి, సుఖం నెలకొంటాయి. దాంపత్య జీవితం ఆనందభరితంగా ఉంటుంది. రాహువు ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి కొత్త లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రేరణ ఇస్తాడు.
ఆరోగ్య పరంగా కూడా మీరు బలంగా ఉంటారు. మానసిక ప్రశాంతత పెరగడం వల్ల నిర్ణయాలు సరైన దిశలో తీసుకోగలుగుతారు. కన్య రాశి వారికి ఇది జీవితం మార్చే అవకాశం కావచ్చు.
మీన రాశి
మీన రాశి వారికి 2026 రాహు సంచారం ఆశాజనకంగా ఉంటుంది. శని ప్రభావం కొంత ఉండినా, రాహువు మీకు అనుకూలతను చూపిస్తాడు. మీ ఆదాయం పెరుగుతుంది, కొత్త వనరులు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి, అవి మీ ప్రతిష్ఠను మరింత పెంచుతాయి.
వ్యాపారాల్లో విస్తరణకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు దేశీయ, విదేశీ స్థాయిలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు వృత్తిపరంగా కొత్త మార్గాలను తెరుస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఆనందం నిండుతుంది.మీన రాశి వారు ఈ కాలంలో మానసికంగా బలపడతారు.
రాహువు ప్రభావం వల్ల నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి.


