Raksha Bandhan Gifts: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో రక్షాబంధన్ ఒకటి. ఈ ఫెస్టివల్ సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. రాఖీ కట్టిన తన సోదరికి సోదరుడు జీవితాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 09న రాబోతుంది. ఇది పవిత్రమైన శ్రావణ మాసంలో వస్తుంది.
ఈరోజున అక్కా చెల్లెళ్లు తమ సోదరుల మణికట్టుపై రాఖీ కట్టి, స్వీట్లు తినిపిస్తారు. అంతేకాకుండా సోదరులు వారికి బహుమతులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే రక్షాబంధన్ సందర్భంగా గిఫ్ట్స్ ఇచ్చేవారు కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం శుభప్రదం కాదు. దీనికి సంబంధించి వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.
ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు..
** రక్షాబంధన్ నాడు అక్కాచెల్లెళ్లుకు వాచ్ గిఫ్టుగా ఇవ్వడం కూడా సరికాదట. ఇది ఇవ్వడం వల్ల శనిదేవుడు ప్రభావం మీ బంధంపై పడే అవకాశం ఉందట.
** బ్లాక్ కలర్ దుస్తులు, నలుపు రంగు వస్తువులను నెగిటివిటీకి చిహ్నంగా భావిస్తారు. అందుకే రాఖీ పౌర్ణమి నాడు సోదరికి ఈ కలర్ కు సంబంధించిన వస్తువులు ఇవ్వడం అశుభంగా భావిస్తారు.
** ఈరోజున సోదరికి పెర్ఫ్యూమ్స్ ఇవ్వడం కూడా మంచిది కాదట. ఇది వారి లైఫ్ లో సమస్యలను సృష్టిస్తుందట.
** ఈ పవిత్రమైన రోజున ఇంతకుముందు వాడిన వస్తువులు గానీ లేదా పదునైన వస్తువులు కానీ గిఫ్ట్ గా ఇవ్వొద్దు. ఇది కూడా మీ మధ్య మనస్పర్థలకు కారణం అవుతుంది.
Also Read: Hindu Mythology- పాముల్లో ఏది అత్యంత శక్తివంతమైనది.. శేష నాగ, వాసుకి, తక్షకుడా?


