Raksha Bandhan 2025: రక్షా బంధన్ పండుగను సోదరులు మరియు సోదరీమణుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీనిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఈ వేడుక ఆగస్టు 9, శనివారం రాబోతుంది.
ఈరోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రాఖీ కట్టి..స్వీట్లు తినిపించుకుంటారు. అనంతరం సోదరిని జీవితాంతం కాపాడతానని సోదరుడు వాగ్దానం చేస్తాడు.అదే విధంగా సోదరి తన సోదరుడు లైప్ లాంగ్ బాగుండాలని కోరుకుంటుంది. అయితే చాలా మందికి పండుగ అయిపోయిన వెంటనే రాఖీ తీయాలా లేదా ఉంచుకోవాలా? తీస్తే ఎప్పుడు తీయాలి, ఉంచుకుంటే ఎప్పటిదాకా ఉంచుకోవాలి? అనే ప్రశ్నలు అందరికి కామన్ గా వచ్చేవి. అయితే దీనిపై ఇప్పుడు మేం క్లారిటీ ఇవ్వబోతున్నాం.
రాఖీని ఎప్పుడు తీయాలి?
రాఖీని విప్పడానికి ఖచ్చితమైన రోజు గురించి గ్రంథాలలో ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రాఖీ పౌర్ణమి తిథి ముగిసిన వెంటనే రాఖీని తీసివేయడానికి సంప్రదాయం అనుమతిస్తుంది. అయితే రాఖీని తీసివేయడానికి జన్మాష్టమి కూడా మంచి రోజు. ఇది రక్షాబంధన్ తర్వాత వారం రోజులకు వస్తుంది. ఈరోజున రాఖీని విప్పడం కూడా ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Festivals in August 2025- Telugu Prabha Telugu Daily అన్ని పండుగలు, వ్రతాలు ఆగస్టులోనే.. లిస్ట్ ఇదే!
రాఖీని ఎక్కువ కాలం ఉంచుకోవచ్చా?
రాఖీ బాగా ఉంటే పర్వాలేదు. కానీ అది చెరిగిన లేదా దెబ్బతిన్న దానిని ఉంచుకోవడం అశుభకరంగా పరిగణిస్తారు. ఇది మీ మణికట్టుకు ఎక్కువ కాలం ఉంచుకోవడం వల్ల మీపై నెగిటివ్ ఎనర్జీ పడే అవకాశం ఉంది. దీని వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మీ కెరీర్లో అడ్డంకులు ఎదురువుతాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగదు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసిరావు. ఇన్నీ అపశకునాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైతే అదే రోజు, లేకపోతే జన్మాష్టమి రోజున రాఖీని తీయడం ఉత్తమం.
Also Read: Raksha Bandhan 2025- రాఖీ పండుగ నాడు ఉపవాసం ఉండాలా?


