Gajakesari Rajyogam in Mithun Rashi: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో కలిసి శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తాయి. మరో రెండు రోజుల్లో అలాంటి యోగమే ఏర్పడబోతుంది. అక్టోబర్ 12న చంద్రుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఇప్పటికే దేవగురు బృహస్పతి అదే రాశిలో ఉన్నాడు. వీరిద్దరి కలయిక కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిథునరాశి
చంద్రుడు, గురుడు కలయిక మిథునరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదురవచ్చు. మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఎల్లప్పుడు అదృష్టం మీ వెంటే ఉంటుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రుణ విముక్తి నుండి బయటపడతారు. వైవాహిక జీవితంలో భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
వృషభరాశి
గజకేసరి రాజయోగం వృషభరాశి వారి తలరాతను మార్చబోతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఇంఫ్రూవ్మెంట్ అవుతాయి. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. భారీగా డబ్బును పొదుపు చేస్తారు. ఉద్యోగులు ఆఫీసులో సానుకూల వాతావరణం ఉంటుంది. మార్కెట్, బ్యాంకింగ్, మీడియా, స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో చుట్టుపక్కల వారినీ ఆకట్టుకుంటారు.
Also Read: Rajyog -100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు అరుదైన యోగం.. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
కన్య రాశి
కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాలను ఇస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. మీరు తల్లిదండ్రులతో మంచి సమయం గడుపుతారు. భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పండితుల సూచనలు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇవ్వబడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


