Hamsa mahapurusha rajayogam on Deepavali 2025:అక్టోబరు నెలలో కొన్ని గ్రహాలు అరుదైన రాజయోగాలను సృష్టించబోతున్నాయి. వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. దేవగురు బృహస్పతి తన సొంత రాశి అయిన కర్కాటకంలో తిరోగమనంలో ఉన్నాడు. గురుడు యెుక్క ఈ సంచారం కారణంగా దీపావళి నాడు అంటే అక్టోబర్ 20న శక్తివంతమైన హంస మహాపురుష రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఇది వందేళ్లు తర్వాత ఏర్పడుతోంది. ఈ యోగ ప్రభావం ఎవరిపై పడుతుందో వారికీ దేనికీ లోటు ఉండదు. ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఇదే రాశిలో హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. దీంతో ఈ రాశి వారు ఊహించని ప్రయోజనం పొందబోతున్నారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కెరీర్ లో చాలా పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. వివాహ యోగం ఉంది. మీ సంపద వృద్ధి చెందుతుంది.
తులా రాశి
గురుడు చేస్తున్న రాజయోగం వల్ల తులా రాశి వారు ఆర్థికంగా లాభపడతారు. అదృష్టం మీకు ప్రతి పనిలోనూ ఉంటుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. లవ్ సక్సెస్ అవుతుంది. మీరు త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్త వినబోతున్నారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు అప్పుల భారం నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Also Read: Dev Diwali 2025 -దేవ్ దీపావళి ఎప్పుడు? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి పవర్ పుల్ రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం మరియు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ లో విజయం ఉంటుంది. ఉద్యోగులు మంచి బెనిఫిట్స్ పొందుతారు. పోటీపరీక్షల్లో లక్ కలిసి వస్తుంది. సంసార జీవితంలో భార్యభర్తలు మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.


