Powerful Yogam in Raskha Bandhan 2025: గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరోక రాశిలోకి వెళతాయి. ఇదే సమయంలో అవి కొన్ని శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఆగస్టు 09న కుజుడు, వరుణుడితో కలిసి నవపంచమ యోగాన్ని సృష్టిస్తున్నాడు. పైగా ఇదే రోజు రాఖీ పౌర్ణమి కూడా. ఇన్ని ప్రత్యేకతలు కారణంగా మూడు రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథునరాశి
మిథునరాశి వారు అనుకోని శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. మీ డబ్బు సమస్యలన్నీ దూరమవుతాయి. వైవాహిక, ఉద్యోగ జీవితాలు బాగుంటాయి. మీ పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కెరీర్ లోని ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. అదృష్టంతోపాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది.
వృషభరాశి
నవపంచమ రాజయోగం వల్ల వృషభరాశి వారు ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతాయి. ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. మీరు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. పెళ్లికాని వారికి వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మీరు పెద్ద మెుత్తంలో డబ్బును అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయడం మీకు లాభిస్తుంది.
మీనరాశి
ఆగస్టులో ఏర్పడబోతున్న పవర్ పుల్ రాజయోగం మీనరాశి వారి తలరాతను మార్చబోతుంది. కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకుంటారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రమోషన్ రానే వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. లక్ ఎల్లప్పుడు మీ వెంటే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.
Disclaimer: పైన ఇవ్వబడిన కథనం సాధారణ నమ్మకాలు, పండితుల సూచనలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రభ దీన్ని ధృవీకరించలేదు.


