Planets transits in August 2025: గ్రహ రాశుల సంచారం పరంగా ఆగస్టు నెల ప్రత్యేకమైనది. ఈ మాసంలో కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. దీని ప్రభావం మెుత్తం 12రాశిచక్రాలపై ఉంటుంది. ఆగస్టు ప్రారంభంలోనే బుధుడు తిరోగమించనున్నాడు. మరోపక్క కుజుడు తులరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వీరిద్దరి కారణంగా కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కెరీర్ పరంగా ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి బాగుంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు చేస్తున్న పనులు పూర్తవుతాయి. మీ స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక, కుటుంబ జీవితం బాగుంటుంది. బిజినెస్ లో లాభాలు మెండుగా ఉంటాయి.
ధనస్సు రాశి
మీకు అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో అనుకోని శుభవార్త వింటారు. సంతానయోగానికి అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కు అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.
మేషరాశి
ఆగస్టు నెల మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఏ కార్యం చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు కష్టాల నుంచి బయటపడతారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సింహరాశి
గ్రహాల సంచారం సింహరాశి వారికి బాగుంటుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు అన్నింటా విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మీ పనిలోని ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు కలిసి వస్తుంది. వ్యాపారంలో అధికంగా లాభాలు ఉంటాయి.
తులా రాశి
కర్కాటక రాశి వారికి గ్రహాల సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. మీరు కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. ఆగస్టులో మీరు అనుకున్న దాని కంటే అధిక లాబాలను పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు కెరీర్ లో ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళతారు.


