Saturday, November 15, 2025
HomeదైవంToday Horoscope In Telugu: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పనులను...

Today Horoscope In Telugu: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పనులను ప్రారంభిస్తారు!

Today Horoscope In Telugu: గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: శు.ఏకాదశి, నక్షత్రం: శతభిషం, వర్జ్యం: రా.8.44 నుండి 10.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.38 వరకు, అమృత ఘడియలు: ఉ.7.17 నుండి 8.54 వరకు, సర్వ ఏకాదశి.

- Advertisement -
  • సూర్యోదయం :    6.02
  • సూర్యాస్తమయం:  5.27
  • రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
  • యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూమి, వాహన యోగాలు కనబడుతున్నాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కనిపిస్తుంది. సోదరుల నుండి ధనలాభం ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న సమస్యలు తీరతాయి.

మిథునం: ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. కార్యక్రమాలలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. మిత్రులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. పనులు ముందుకు సాగడంలో జాప్యం. దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. బంధువులతో తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి, ఉద్యోగాలలో పనిభారం అధికమవుతుంది.

సింహం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తగ్గుతాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి.

కన్య: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

తుల: కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. రుణయత్నాలు చేయాల్సి రావచ్చు. పనుల్లో అవాంతరాలు, బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధువులతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు, దేవాలయ దర్శనాలు. ధనలాభం కనబడుతోంది. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.

మకరం: కష్టపడ్డా ఫలితం కనిపించక పోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు పెరిగే అవకాశం.

కుంభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరే అవకాశం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. శుభవార్తలు వింటారు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad