Sabarimala Pilgrimage: శబరిమల అయ్యప్ప స్వామివారి వార్షిక మండల తీర్థయాత్ర ఈ ఏడాది అధికారికంగా మొదలైంది. 41 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక పూజాకాలానికి ఆలయ ద్వారాలు ఇప్పటికే తెరుచుకోవడంతో సన్నిధానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం కోసం శబరిమల రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు యాత్రా సీజన్ దృష్ట్యా భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
ఈసారి మండల కాలానికి చేరువ అవుతున్న భక్తులకు కొంతమేర నిబంధనలు మారినట్లు దేవస్థానం బోర్డు ఇప్పటికే ప్రకటించింది. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటం కారణంగా చిన్నచిన్న నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అందుకు అనుగుణంగా యాత్రామార్గాల్లో భద్రతను పెంచడం, ఆన్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచడం, మరింత సమర్థవంతమైన నియంత్రణ చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు అమల్లోకి వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
అయ్యప్ప దర్శనం కోసం దీక్ష చేయడం మండల కాలపు ప్రధాన భాగం. 41 రోజుల పాటు నియమాలను పాటించి, మాలలు ధరించిన భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల చేరితేనే ఆలయానికి రానున్న ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి అవుతుందని భావిస్తారు. ఈసారి కూడా అదే తరహాలో దేశం నలుమూలల నుంచి భక్తులు దిక్సూచి పట్టారు. మండల పూజలు ప్రారంభం కావడానికి ముందు రోజు ఆలయాన్ని తెరవడంతో సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
ఆలయం తెరిచిన వెంటనే ప్రధాన పూజారి పద్దతి ప్రకారం 18 పది మెట్లు దిగుతూ సన్నిధానం నుండి తెచ్చిన జ్యోతితో పవిత్ర గుండం వెలిగించారు. ఇది మండల యాత్ర ప్రారంభాన్ని సూచించే ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు. అనంతరం పూజారులు గర్భగుడిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ యాత్రికులు భక్తి భావంతో సన్నిధిలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు.
మండల కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనాలకు ప్రత్యేక సమయాలు నిర్ణయించారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం ఒకటి వరకు భక్తులు దర్శనం పొందవచ్చు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ఆలయం తెరుస్తారు. రాత్రి పదకొండు గంటల వరకూ దర్శనాలు కొనసాగుతాయి. ఇలా ప్రతీరోజూ రెండు విడతల్లో దర్శన సమయాలను అమలు చేస్తున్నారు.
90 వేలమంది భక్తులను..
రోజుకు 90 వేలమంది వరకు భక్తులను అనుమతించేందుకు టీడీబీ ఏర్పాట్లు చేసింది. అందులో పెద్ద భాగం వర్చువల్ క్యూ టోకెన్ల ద్వారా వస్తుంది. 70 వేల వర్చువల్ టోకెన్లు ఆన్‌లైన్‌లో ఇచ్చేందుకు ఏర్పాట్లు కాగా, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 20 వేల టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మొత్తం రాకపోకలను ఒక నియంత్రిత విధానంలో నిర్వహించాలన్నదే దేవస్థానం బోర్డు లక్ష్యం.
జనవరి 14న మకర జ్యోతి..
ఈ ఏడాది నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు డిసెంబర్ 27న ముగుస్తాయి. ఆ రాత్రి పదిగంటలకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. అనంతరం మకర జ్యోతి, మకర సంక్రాంతి పూజల కారణంగా డిసెంబర్ 30న ఆలయం మళ్లీ తెరుస్తారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. ఇది శబరిమల సీజన్‌లో అత్యంత ముఖ్యమైన రోజు. తర్వాత జనవరి 20న పడిపూజతో ఈ సంవత్సరం యాత్రా సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు.
ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేయడంతో భద్రతా పరమైన చర్యలను మరింత బలోపేతం చేశారు. యాత్రాదారులు అధికంగా వచ్చే పంబ, నిలక్కల్, సన్నిధానం, పది మెట్లు వంటి ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మొత్తం 18 వేల మంది పోలీసు సిబ్బందిని యాత్రా మార్గాల నిర్వహణకు నియమించారు. రద్దీ ఎక్కువగా కూడే ప్రాంతాల్లో అదనపు నియంత్రణ కేంద్రములను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సేవలను కూడా సిద్ధం చేశారు.
ఆలయ పరిసరాల్లో ఈసారి కొన్ని నిబంధనలు ప్రత్యేకంగా అమలు చేస్తున్నారు. ఆలయం దగ్గర ఫోటోలు లేదా వీడియోలను తీసుకోవడం పూర్తిగా నిషేధించినట్లు దేవస్థానం బోర్డు స్పష్టంగా తెలిపింది. ఇది ఆలయ నియమాలు పాటించడమే కాకుండా సముచిత భక్తి వాతావరణం కాపాడటానికి కూడా అవసరమని యాత్రికులకు తెలియజేస్తున్నారు. ఇరుముడి తీసుకుని వచ్చే భక్తులు సూచనలు పాటించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
వైద్య సిబ్బంది, అత్యవసర వాహనాలు..
అదనంగా, యాత్రా కాలంలో వైద్య సిబ్బంది, అత్యవసర వాహనాలు, మొబైల్ మెడికల్ యూనిట్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎక్కువగా నడిచే పథాల్లో పానీయ జల బందోబస్తు, విశ్రాంతి కేంద్రాలు, తాత్కాలిక నివాస సదుపాయాలు కూడా సిద్ధంగా ఉంచారు. రవాణా పరంగా కేఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను పెంచి, నిలక్కల్ నుంచి పంబ వరకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది.
మండల యాత్ర ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. ఈసారి కూడా ఆ ప్రయాణం ఆరంభమైన మొదటి రోజునుంచే రద్దీ పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇరుముడి వేసుకుని దీక్షాచరణంలో నడిచే భక్తుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు, వృద్ధులకు ప్రత్యేక సహాయక బృందాలను నియమించారు.
యాత్రకు వచ్చే ప్రతి భక్తి స్వామి దర్శనం కోసం ఎన్నో రోజుల పాటు ఎదురుచూస్తారు. ఈసారి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థతో భక్తులు ముందుగానే తమ సమయం, తేదీని నిర్ణయించుకోవచ్చు. ప్రసాదాలు సైతం ముందస్తు బుకింగ్ పై అందుబాటులో ఉండటంతో ఆలయంలో రద్దీ తగ్గేలా చర్యలు తీసుకున్నట్లు టీడీబీ వెల్లడించింది. ప్రసాదాల పంపిణీలో ఆలస్యం కాకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

