కేరళలోని శబరిమల (sabarimala) శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్‌లో రూ.440 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఇది రూ.86 కోట్లు అధికమని దేవస్వం బోర్డు చైర్మన్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.
గత ఏడాది రూ.354 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. సాధారణంగా ప్రతి ఏటా సుమారు రూ. 4-5 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, కానీ ఈ ఏడాది భారీగా పెరిగిందని ఆయన అన్నారు. ఈ స్థాయిలో ఆలయం రావడం ఆలయ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.
2024 సంవత్సరంలో నవంబరు 16 నుంచి జనవరి 20 వరకు రెండు నెలల పాటు మండల-మకర విళక్కు పూజలు వైభవంగా సాగాయి. అప్పుడు మొత్తం 55 లక్షల మంది భక్తులు శబరిమలకు వచ్చి దర్శనాలకు చేసుకున్నట్టు వివరించారు. గత యాత్రా సీజన్‌తో పోల్చితే సుమారు 5.5 లక్షల మంది అధికంగా వచ్చారని తెలిపారు.