Sunday, October 6, 2024
HomeదైవంSamsthan Narayanpur: వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు

Samsthan Narayanpur: వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు

సంస్థాన్‌ నారాయణపుర్ మండల వావిళ్ళపల్లి గ్రామాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి–శ్రీదేవి, భూదేవి కళ్యాణం కన్నుల పండుగగా వేదమంత్రాల ఉచ్చారణతో వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు గణపతి పూజ, పూణ్యవచనము, మంటపారాధానతో, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. హోమం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు.

- Advertisement -

దేవాలయ నిర్మాణ దాత బిజ్జాల విజయ్‌కుమార్‌–విజయరాణీలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలను బ్రహ్మశ్రీ మడా పాపాయ్యశర్మ, పాల పవన్‌కుమార్‌శర్మ, దేవాలయం అర్చకుడు దేవ్‌ప్రకాష్‌ మిశ్రల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచికంటి భాస్కర్, సుధాకర్, ఉపేందర్, బెలిదే ఆశోక్, గజవెళ్ళి రమేష్, బెలిదే పాండరీనాద్, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News