Saturday, October 5, 2024
HomeదైవంSangareddy: శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ పునః ప్రతిష్టాపన వేడుకలు

Sangareddy: శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ పునః ప్రతిష్టాపన వేడుకలు

సంప్రదాయబద్ధంగా జరుగనున్న కార్యక్రమాలు

సంగారెడ్డిలోని బైపాస్ రహదారిలో ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పునః ప్రతిష్టాపన వేడుకలు ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24వ తేదీన ఉదయం 9 గంటలకు సంగారెడ్డి లోని శ్రీ నవరత్నాలయ దేవస్థానం నుంచి బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కార్యక్రమం జరుగనుంది. 25, 26, 27 తేదీల్లో దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. 28వ తేదీన ఉదయం 3 గంటలకు అయ్యప్ప స్వామి ఇతర దేవతల యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తొమ్మిది గంటలకు మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. రాత్రి ఆరు గంటలకు మాన్యశ్రీ అరుణ్ గురు స్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుంది.

- Advertisement -

సమావేశంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి ప్రేమ్ సాగర్, కార్యనిర్వాహక కార్యదర్శి అరుణ్, సభ్యులు ప్రసాద్ వీర్ కుమార్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News