Saturn and Jupiter retrograde 2025 effect on Zodiac Signs: జూలై నెలలో కొన్ని గ్రహాల గమనంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ముుఖ్యంగా ఈ మాసంలో బృహస్పతి , శని గ్రహాలు రివర్స్ లో కదలనున్నాయి. ఇలా జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. అదృష్టాన్ని ఇచ్చే గురుడు, కర్మ ఫలితాలను ఇచ్చే శనిదేవుడు తిరోగమనం మూడు రాశులవారికి అదృష్టాన్ని తీసుకురానున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
శని, బృహస్పతిల రివర్స్ కదలిక సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే రియల్ స్టేట్ రంగంలో ఉంటారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వీరికి ఊహించని లాభాలు కలుగుతాయి. బిజినెస్ లో లాభాలు ఉండటంతో దానిని విస్తరిస్తారు. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభించే సూచనలు ఉన్నాయి. మెుత్తానికి ఈ సమయంలో సింహరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
మిథున రాశి
శని, బృహస్పతి తిరోగమనం కారణంగా మిథునరాశి వారు అనతి కాలంలోనే ధనవంతులు అవుతారు. వ్యాపారులకు ఈ సమయం కలిసొచ్చి.. భారీగా లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు ఈ టైం కలిసి వస్తుంది.
వృషభ రాశి
జూలైలో గ్రహాల కదలిక వల్ల వృషభరాశి వారి ఫేట్ మారబోతుంది. కుటుంబ సభ్యుల అండతో ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారు. మీరు ఇంతకకముందు ఎవరికైతే డబ్బు ఇచ్చారో వారు తిరిగి ఇస్తారు. ఫ్యామిలీతో కలిసి వీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహాయోగం ఉంది. ఉద్యోగం కొట్టాలన్న మీ కల నెరవేరుతుంది. మీరు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన ఇంటర్నెట్ సమాచారం, సాధారణ నమ్మకాలు మరియు జ్యోతిష్యూల సూచనలపై ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రభ దీన్ని ధృవీకరించలేదు.


