Saturn Nakshatra Transit 2026: వేద జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫలదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. సాధారణంగా శనిదేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. ఇతడు తన నక్షత్రాన్ని త్వరగానే మారుస్తాడు. శనీశ్వరుడు సుమారు ఏడాదిపాటు నక్షత్రంలో సంచరిస్తాడు. మళ్లీ అది నక్షత్రానికి తిరిగి రావాలంటే అతనికి 27 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని తన సొంత నక్షత్రమైన ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది అదే నక్షత్రం యెుక్క రెండో దశలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు సమయంలో కర్మఫలదాత బృహస్పతి యెుక్క మీనరాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు.
మీన రాశి
మీనరాశిలోనే శని కూర్చుని ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి అతడి కటాక్షం ఉంటుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. గతంలో చేసిన తప్పులు నుండి నేర్చుకుంటారు. మీ ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు ముగుస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ చేస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
వృషభ రాశి
శని నక్షత్ర సంచారం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ పని లేదా కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ ఫలిస్తాయి. మీ కోరికలన్నీ సకాలంలో నెరవేరుతాయి. విజయానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. ఆఫీసులో మీ సీనియర్ సపోర్టు ఉంటుంది. బాస్ మీ వర్క్ ను మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు రెడీ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
Also Read: Mars Transit 2025 -త్వరలో డేంజరస్ యోగం.. డిసెంబరు వరకు ఈ 3 రాశుల వారు బీ కేర్ పుల్..
మిథున రాశి
రాబోయే సంవత్సరం మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడుపుతారు. కెరీర్ లో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.


