Friday, March 13, 2026
HomeదైవంSaturn: 30 ఏళ్ల తర్వాత ఊహించని సంఘటన..ఆ ఎఫెక్ట్‌ తో వీరికి

Saturn: 30 ఏళ్ల తర్వాత ఊహించని సంఘటన..ఆ ఎఫెక్ట్‌ తో వీరికి

Saturn transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మ సిద్ధాంతానికి ప్రతీకగా భావించే శని గ్రహం మన జీవితంలో జరిగే సంఘటనలపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. శని గ్రహం నెమ్మదిగా కదిలే గ్రహం కావడం వల్ల ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటూ ఆ రాశి వారికి శుభఫలితాలు లేదా సవాళ్లు తీసుకువస్తుంది. అందుకే శని సంచారం జరిగే సమయంలో ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -

శని గ్రహం తన రాశి..

ఇలాంటి నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శని గ్రహం తన రాశి ప్రయాణంలో కీలకమైన మార్పు చేయనుంది. ఈ సమయంలో శని గ్రహం మీన రాశిలో సంచారం చేయనుంది. సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత శని గ్రహం మళ్లీ మీన రాశిలో ప్రవేశిస్తుండటం విశేషం. ఈ సంచారం వల్ల అన్ని రాశులపై ప్రభావం పడినా, ముఖ్యంగా నాలుగు రాశులకు మాత్రం అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపించనున్నాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/solar-eclipse-after-maha-shivaratri-2026-impact-on-zodiac-signs/

శని మీన రాశిలోకి..

శని మీన రాశిలోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, ఉద్యోగ రంగంలో పురోగతి, కుటుంబ జీవితంలో స్థిరత్వం వంటి మార్పులు కొన్ని రాశుల వారికి అనుభవంలోకి రానున్నాయి. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఏప్రిల్ నెల నుంచి స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధనస్సు రాశి వారికి ..

ధనస్సు రాశి వారికి ఈ శని సంచారం అనుకూలంగా మారనుంది. శని గ్రహం మీన రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకులు తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వం పెరుగుతుంది. చదువులో ఉన్న విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు దక్కే సూచనలు ఉన్నాయి. పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శని దృష్టి అనుకూలంగా ఉండటం వల్ల దీర్ఘకాల పెట్టుబడులు లాభాలు ఇవ్వవచ్చని అంచనా.

మిథున రాశి వారికి…

మిథున రాశి వారికి శని సంచారం కర్మ స్థానాన్ని ప్రభావితం చేయనుంది. దీని వల్ల చట్టపరమైన వ్యవహారాల్లో అనుకూల నిర్ణయాలు రావచ్చు. కోర్టు కేసులు లేదా వివాదాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఉద్యోగం చేసే వారికి బాధ్యతలు పెరిగే అవకాశంతో పాటు పదోన్నతులు కూడా ఆశించవచ్చు. చాలా కాలంగా విదేశీ ప్రయాణం లేదా విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు తగ్గి, ఇంటి మరియు కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశముంది.

మకర రాశి వారికి..

మకర రాశి వారికి శని సంచారం అత్యంత శుభప్రదంగా మారనుందని చెప్పవచ్చు. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశముంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు ఇల్లు కొనుగోలు చేయడం, స్థిరాస్తి పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు క్రమంగా పెరిగే సూచనలు ఉన్నాయి. మొత్తంగా మకర రాశి వారికి ఈ కాలం పురోగతికి అనుకూలంగా ఉండనుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/dhana-shakti-rajayoga-on-february-23-aquarius-planetary-alignment/

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి కూడా శని మీన రాశి సంచారం చాలా మంచి ఫలితాలు ఇవ్వనుంది. కుటుంబ జీవితంలో శుభకార్యాలు జరగే అవకాశముంది. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభ సందర్భాలు ఇంట్లో జరగవచ్చని జ్యోతిష్య అంచనా. వ్యాపారం చేసే వారికి లాభాలు గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ అవకాశాలు రావచ్చు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రమకు తగిన గుర్తింపు లభించే కాలంగా ఇది మారవచ్చని విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News