Seeing Snakes in Your Dreams during Shravana Masam: మనిషి కలలు కనడం సహజం. మనం రకరకాల స్వప్నాల్ని కంటూ ఉంటాం. కొందరికి తమ పూర్వీకులు కలలో కనిపిస్తే.. మరికొందరికి వాళ్లకు ఇష్టమైన వ్యక్తులు వస్తూంటారు. మనుషులే కాక పాములు, జంతువులు, దేవుళ్లు, దేవాలయాలు, వాహనాలు కూడా స్వప్నంలో కనిపించడం చూస్తూ ఉంటాం. యువకులు అయితే నచ్చిన అమ్మాయిని, యువతులైతే కోరుకున్న అబ్బాయిని కలలో చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందని పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో శ్రావణ మాసంలో స్వప్నంలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది? స్వప్నశాస్తం ఏం చెబుతోంది? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభంకానుంది. ఇది మహాదేవుడికి చాలా ప్రీతకరమైన మాసం. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ భక్తితో శివయ్యను కొలుస్తారు. ఉపవాసం ఉండి నియమ నిష్టలతో శివారాధన చేస్తే మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. మీకు దేనికీ లోటు ఉండదు. అయితే ఈసారి శ్రావణ ఆగస్టు 23 వరకు ఉండబోతోంది. ఈ నెలలోనే ప్రతి సోమవారం మహాదేవుడిని, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని కొలుస్తారు. ఉత్తర భారతంలో ఇదే సమయంలో కన్వర్ యాత్ర చేస్తారు. ఈ మాసంలో శివభక్తులు గంగానదికు వెళ్లి ఆ జలాన్ని బిందెలతో నింపి కావిడి కట్టి తమ భుజాలపై తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి కాలినడకన తీసుకొచ్చి శివలింగానికి గంగాజలంతో అభిషేకిస్తారు.
శివుడి కంఠాభరణమైన పాము వాసుకీ. ఇది పాముల్లోనే శ్రేష్టమైనది. మహాదేవుడు ఇష్టమైన పాము శ్రావణమాసంలో కలలో కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన మాసంలో కలలో శ్వేతనాగును చూడటం శుభసంకేతమని నిపుణులు అంటున్నారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా భారీగా లాభాలను ఇస్తుంది. అదే విధంగా స్వప్నంలో నల్లటి రంగు పాము కనిపించినా కూడా మంచిదిగా భావిస్తున్నారు. ఇది కనిపిస్తే బోలాశంకరుడే స్వయంగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్లు భావిస్తారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి కలలోకి వస్తే ఇది దీర్ఘాయువుకు సూచిక. నాగుపాముల జంట కనిపించడం కూడా శుభప్రధంగా భావిస్తారు.


