పూరీ బీచ్(తెలుగు ప్రభ): దుర్గమ్మ విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసిన సుదర్శన్ పట్నాయక్ ఈసారి వినూత్నంగా అమ్మ రూపాన్ని రూపొందించారు. 32 రకాల పళ్లు-కూరగాయలతో అమ్మ రూపాన్ని సజీవంగా ఉండేలా ఇసుకతో తీర్చిదిద్దారు సుదర్శన్.
ఒరిస్సాలోని పూరీ బీచ్ లో ఈ దుర్గామాత ఆర్ట్ వర్క్ రూపొందించగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 22 రకాల కూరగాయలు, 10 రకాల పళ్లు ఇందుకోసం వినియోగించారు. “హ్యాపీ మహాసప్తమి” అంటూ ట్వీట్ చేస్తూ అమ్మవారి రూపాన్ని తయారు చేసే విధానం ఆద్యంతం వీడియో రూపంలో సుదర్శన్ షేర్ చేశారు. శాకాంబరిగా అమ్మవారు బీచ్ లో ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తుండటంతో బీచ్ కు సందర్శకులు పోటెత్తుతున్నారు.

