Shani Budh Vakri 2025 effect on zodiacs: గ్రహాల స్థానం మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వచ్చే నెలలో శనిదేవుడు, బుధుడు వక్రదిశిలో కదలనున్నారు. న్యాయదేవుడైన శనీశ్వరుడు జూలై 13న మీనరాశిలో తిరోగమనం చేయనున్నాడు. అదే విధంగా గ్రహాల రాకుమారుడు బధుడు జూలై 18న రివర్స్ కదలనున్నాడు. వీరిద్దరి తిరోగమనం నాలుగు రాశులవారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీనరాశి
ఇదే రాశిలో శని తిరోగమించనున్నాడు. దీంతో మీనరాశి వారికి కష్టాలు మెుదలకానున్నాయి. వచ్చే నెల మెుత్తం వీరికి కలిసిరాదు. ఈ సమయంలో ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోవాలి. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి డైట్ ఫాలో అయితే మీకే మంచిది. ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. డబ్బు దుబారా చేయకండి. శని వక్రదృష్టి కారణంగా మీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
జూలైలో గ్రహాల యువరాజు, కర్మఫలాన్ని ఇచ్చే శని ఇద్దరు కలిసి కుంభరాశి వారిని అష్టకష్టాలపాలు చేయనున్నారు. ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. అనవసర ఖర్చులు మానుకోండి. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోండి. వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. భార్యభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతాయి. పేదవారు మరింత పేదరికంలో కూరుకుపోతారు. పొదుపు చేసిన డబ్బును ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మికతపై మక్కువ పెంచుకోవడం మంచిదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తులారాశి
బుధుడు, శని తిరోగమనం తులరాశి వారికి సమస్యలను పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మరికొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు. ఇతరులతో వాదనకు దిగకండి. దూర ప్రయాణాలు మానుకోండి. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. మీ కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
సింహ రాశి
శని, బుధుడు స్థానాల్లో మార్పు వల్ల సింహరాశి వారు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు మానసికంగా కృంగిపోతారు. మీకు అప్పుల బాధ ఎక్కువవుతుంది. ఇతరులతో మీ సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తగ్గుతాయి. ఖర్చులు పెరిగి డబ్బు సమస్యను ఎదుర్కోంటారు.
Note: ప్రియమైన పాఠకులారా ఈ వార్తను ఇంటర్నెట్ సమాచారం, పండితులు, నిపుణులను సంప్రదించి ఈ ఆర్టికల్ ను ఇచ్చాం. ఈ వార్తను తెలుగు ప్రభ నిర్ధారించడం లేదు. మా న్యూస్ చదివినందుకు ధన్యవాదాలు.