SaturnTransit 2025: నవగ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శని అనుగ్రహం ఉంటే వారికీ దేనికీ లోటు ఉండదు, అదే శని వక్ర దృష్టి పడిదంటే మీ జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. కర్మఫలదాత శని ప్రతి రెండున్నరేళ్లకొకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. నెమ్మదిగా కదిలే శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత బృహస్పతి రాశి అయిన మీనరాశిలోకి మార్చి 29న ప్రవేశించింది. 2027 వరకు న్యాయదేవుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ కదలిక కొన్ని రాశులవారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
శని ప్రత్యక్ష సంచారం ధనస్సు రాశి వారికి అద్భుత ఫలితాలను ఇవ్వబోతుంది. దీంతో మీకు ధనయోగం కలగబోతుంది. మీరు ఇంతకముందు ఎన్నడూ చూడని డబ్బును పొందుతారు. మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. భార్యభర్తలు మంచి సమయం గడుపుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు బాగుంటాయి. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి గొప్పస్థాయికి చేరుకుంటారు. నూతన దంపతులకు సంతానభాగ్యం ఉంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అర్థాంతరంగా ఆగిపోయిన మీ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి.
వృషభ రాశి
శనిదేవుడు సంచారం వృషభ రాశి వారి కష్టాలను కడతేర్చనుంది. ఇప్పటివరకు వక్రగమనంలో ఉన్న శని.. ఈనెలలోనే ప్రత్యక్ష గమనంలోకి రానున్నాడు. దీంతో వృషభరాశివారికి వచ్చే రెండేళ్లపాటు సంపదకు తిరుగుండదు. ఇప్పటివరకు చీదరించుకున్న బంధువులే మీకు దగ్గరకు వస్తారు. దంపతులు మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. తోబట్టువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీరు ఏదైనా అనుకోని శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. జాబ్, బిజినెస్ చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది.
మీ జాతకంలో శనిదోషం ఉందా?
శనిదేవుడు మీ జాతకంలో మంచి స్థితిలో ఉంటే శుభఫలితాలను లేదంటే అశుభఫలితాలను ఇస్తాడు. మీ కుండలిలో శనిదోషం ఉన్నవారు శనివారం ఉపవాసం ఉంటూ..శనిదేవుడి ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించి పూజించండి. దీంతో మీ దోషం పోయి..ఆ కర్మఫలదాత ఆశీస్సులు మీకు లభిస్తాయి. శనివారం నాడు హనుమాన్ ను పూజించిన లేదా పేదవారికి, బ్రహ్మణులకు దానాలు చేసిన శనిదేవుడు సంతోషిస్తాడు.