HomeదైవంShani Dev: మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే శనివారం ఇలా చేయండి..

Shani Dev: మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే శనివారం ఇలా చేయండి..

- Advertisement -

Shani Dev Puja Rituals: నవగ్రహాల్లో శని కూడా ఒకటి. ఖగోళ శాస్త్రపరంగా, అందమైన గ్రహం మరియు ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న ఫ్లానెట్ శని. జ్యోతిష్యశాస్త్రంలో కూడా శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని కర్మఫలదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. మీ జాతకంలో శని శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. అదే శనీశ్వరుడు వక్ర దృష్టి మీపై పడితే మీ జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే మనం ఎల్లప్పుడూ మంచి చేయడానికి చూడాలి. శనిదేవుడు అనుగ్రహం పొందాలంటే శనివారం అతడికి పూజ చేయాలి. శనివారం శనిని ఆరాధించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుంది. అంతేకాకుండా శనివారం ఉపవాసం చేస్తూ..శనీశ్వరుడికి సంబంధించిన కొన్ని పరిహారాలను చేయడం ద్వారా ఏలినాటి శని, శని దోష ప్రభావాలు తొలగిపోతాయి.

పూజ ఎలా చేయాలి?

శనివారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నలుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తర్వాత రావి చెట్టును పూజించి దానికి నీరు పోయాలి. సాయంత్రం శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆ దేవుడికి ఆవనూనె లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి. అనంతరం శనిదేవుడికి నల్లటి వస్త్రాన్ని సమర్పించండి. చివరగా శనిదేవుడి మంత్రాన్ని పఠిస్తూ..శని చాలీసా పారాయణం చేయాలి. శనీశ్వురుడిని ఇంట్లోని పూజ గదిలో కంటే గుడికి వెళ్లి పూజించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించకూడదని వారు చెబుతారు.

Also Read: Chaturgrahi Yoga 2025 -50 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో 4 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు అదృష్టమే ఇక..

శని దేవుడి ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యుడు కుమారుడు. శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని జరుపుకుంటారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు శని జయంతిని నిర్వహిస్తారు. ఈరోజున కర్మఫలదాత మానవుల జీవితంపై పెను ప్రభావాన్ని చూపిస్తారు. పైగా ఇతడు శని గ్రహాన్నిపాలిస్తాడు. మీరు లైఫ్ లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు శనిదేవుడిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. శనివారం నాడు ఉపవాసం ఉంటూ శనీశ్వరుడిని ఆరాధిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది. శనిదేవుడిని నిత్యం ప్రార్థించడం వల్ల భక్తులు అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు.

Also Read: Sarva Pitru Amavasya 2025 -సర్వ పితృ అమావాస్య ఎప్పుడు? ఈరోజున పూర్వీకులకు తర్పణం ఎలా చేయాలి?

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News