Shani Vakri 2025 effect: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫలదాత అని పిలుస్తారు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఆయనను న్యాయదేవుడు అని పిలుస్తారు. ఈ నెల 13 నుంచి శనిదేవుడు రివర్స్ లో కదలనున్నాడు. అదే స్థితిలో అతడు 138 రోజులపాటు ఉండనున్నాడు. శని యెుక్క తిరోగమనం కారణంగా నవంబరు 28 వరకు కొన్ని రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి
తిరోగమించబోతున్న శని వృషభరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. పెళ్లికానీ ప్రసాదులకు వివాహ సూచనలు కనపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అండతో మీరు ఎలాంటి కార్యన్నైనా సులువుగా చేయగలుగుతారు. మీకు ఊహించని ధనలాభం ఉంటుంది. మీరు పనిచేస్తున్న ఆఫీసులోనే మంచి పొజిషన్ కు వెళతారు. మీ జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. మీరు అన్ని సమస్యల నుండి బయటపడి.. నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఈ సమయంలో చేసే ఇన్వెస్ట్ మెంట్స్ మీకు ఎన్నో లాభాలను తీసుకొస్తాయి.
కర్కాటక రాశి
కర్మఫలదాత తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. పూర్వీకులు ఆస్తులు కలిసి వస్తాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా, వ్యాపారం మెుదలుపెట్టాలన్నా ఇదే అనుకూల సమయం. మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మిమ్మల్ని అనుకోని అదృష్టం వరిస్తుంది. ఈ టైంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా మీకు లాభిస్తాయి. శనిదేవుడు ఆశీస్సులతో పేదరికం పోతుంది.
మీన రాశి
శనిదేవుడు వక్ర గమనం మీనరాశి వారికి ఎన్నో లాభాలను ఇవ్వనుంది. రాబోయే 138 రోజులు ఈ రాశి వారికి డబ్బుకు లోటు ఉండదు. భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీకు ప్రతి పనిలో శనిదేవుడు అనుగ్రహం లభించి ఆ కార్యాన్ని తొందరగా నెరవేరుస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. కెరీర్ లో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇంతకముందు కంటే బాగుంటుంది. పాత బాకీలన్నీ తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కల ఫలిస్తుంది.
Note: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, హిందూ మత నమ్మకాల,ఇంటర్నెట్ సమాచారం వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించబడింది. తెలుగుప్రభ దీనిని ధృవీకరించడం లేదు.